అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి?
అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి ?
ఏటికి ఎదురీదడమే గొప్ప సాహసమైతే దానికి సమాంతరంగా మరో ప్రవాహాన్ని నడపడం ఇంకా గొప్ప సాహసం....దీనికి అంబేద్కర్ జీవిత పోరాటమే గొప్ప ఉదాహరణ...
ఇక్కడ ఏరు అంబేద్కర్ విదేశాలలో చదువు పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చిన కాలానికి గాంధీ నాయకత్వంలో ఉవ్వెత్తున సాగుతున్న భారత జాతీయ రాజకీయ స్వాతంత్ర్య ఉధ్యమం.
మరి ముందు మీ ఇల్లు చక్క దిద్దుకుంటూ సాటి భారతీయులను సమానంగా చూడండి అప్పుడే మీకు బ్రిటిష్ వారిని వ్యతిరేకించే నైతికత ఉంటుందనే ప్రశ్న ఉధ్యమానికి ఘాటుగానే తగులుతుంది కదా తగిలింది కూడా..అందుకే అంబేద్కర్ ని దేశ ద్రోహి, బ్రిటిష్ ఏజెంట్,ఉధ్యమ ద్రోహి అని బిరుదులిచ్చారు..కాంగ్రెస్ పార్టీ ప్రెస్ ఆయన మీద దాడి చేసింది..
ఆయన నడిపిన సమాంతర ప్రవాహం సామాజిక సంస్కరణ ఉధ్యమం..దళిత ఉధ్యమ రాజకీయాలు.
హిందూ ధర్మంలో సంస్కరణ అంటే హిందువులను విడదీసి బ్రిటిష్ వాళ్ళకి సహకరించడంలా భావించిన రోజులు అవి...
ఉధ్యమానికి ఆర్థిక సహకారం అడిగితే పేదరికంలో మగ్గిపోతున్న,భూమి లేని దళితులు ఎంతని ఇవ్వగలరు.
గట్టిగా కృషి చేస్తే ఐదొందలు వసూలవడానికే గగనమయ్యాయి.. మరి గాంధీ అడిగితే ఒక్క వారంలోనే లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న బిర్లాలు ఇతర వ్యాపార,భూస్వామ్య వర్గాలు..
ఇదీ అంబేద్కర్ పరిస్థితి దళితులను మనిషి గా చూడడానికి కనీస హక్కుల కోసం సామాజిక సంస్కరణ ఉధ్యమ నాయకత్వం వహించినప్పుడు.
ఫూలే సామాజిక సంస్కరణ ఉధ్యమ కాలానికి ఇంకా జాతీయ ఉధ్యమం బలపడలేదు..కానీ అంబేద్కర్ కాలానికి చాలా బలపడింది.. అందుకే ఆయన ప్రశ్నించింది కాంగ్రెసు ప్రధాన నాయకత్వాన్నే..ఆయన విసిరిన నైతిక సవాల్ ఉదారవాద హిందూ నాయకులకే తగిలింది..
అప్పటికి సంఘ్ పరివార్ శక్తులు బలపడనే లేదు..
అంబేద్కర్ మరో ప్రత్యేకత ఏమిటంటే మార్టిన్ లూథర్ కింగ్,నెల్సన్ మండేలాల లాగా gradualism అంటే మార్పు చిన్న చిన్న గా వస్తుందని నమ్మిన వ్యక్తి కాదు..
He is a Rebel..జట్ పట్ తోడక్ మండల్ వారు Annihilation of caste ప్రసంగంలో మార్పు చేయాలంటే ఆ సమావేశాన్ని బహిష్కరించారేగానీ మార్పు చేయలేదు..
అందుకే కింగ్, మండేలాలకు Mainstream సమాజం నుంచి వ్యతిరేకత అంత పెద్దగా రాలేదు..కానీ అంబేద్కర్ తన జీవిత కాలంలో కాంగ్రెస్ నుంచే తీవ్ర మైన వ్యతిరేకత ఎదుర్కొన్నాడు.
రాజ్యాంగ అసెంబ్లీ కి ఎన్నికవడానికి మొదట్లో కాంగ్రెస్ అస్సలు సహకరించలేదు..ముస్లిం లీగ్ సహాయంతో బెంగాల్ నుండి ఎన్నికవ్వాల్సి వచ్చింది..
డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నారు కదా అనొచ్చు ..ఈ ప్రశ్న కు నవ్వు రాదు..🙂 ఇరవై సంవత్సరాల లెజిస్లేటివ్ అనుభవం, రెండు ఆర్థిక శాస్త్ర పీహెచ్డీలు,లా డిగ్రీ ఉన్న వ్యక్తి ని ఎన్నుకోకపోతే కాంగ్రెస్ నాయకత్వం తనను తాను అవమానించుకోవడం కాదూ...ప్రతిభ కు ఏమాత్రం గౌరవమిచ్చారనే నైతిక ప్రశ్న రాదూ?
ఆ కాలంలో అంబేద్కర్ ప్రశ్నలు ఎదుర్కోని పార్టీ, గ్రూపు లేదు ..కాంగ్రెస్, కమ్యూనిస్టు, సోషలిస్టు, ముస్లిం లీగ్,హిందూ మహాసభ ఇలా అన్ని వర్గాలపై సామాజిక న్యాయ ప్రశ్నలు సంధించారు..
అంబేద్కర్ సంస్కరణ కోరని మతం,వర్గం లేదు..రాజ్యాంగంలో దళితుల హక్కులకు ఎంత ప్రాధాన్యత నిచ్చాడో మైనారిటీలు,ఆదివాసీలు,మహిళలు ఇతర బలహీన వర్గాలకు తమ వంతు వాటా ఉండాలని శాయశక్తులా కృషి చేశాడు.
ఆయన ప్రశ్నలు ఎదుర్కోని Mainstream నాయకులు లేరు..గాంధీ, నెహ్రూ, జిన్నా..
హిందూ మతం ప్రధానంగా ఆయన విమర్శల బాణాలు ఎదుర్కొన్నప్పటికీ ఇస్లాం, క్రైస్తవం కూడా విమర్శలనుండి తప్పించుకోలేదు..ఆఖరికి ఆయన మారిన బుద్దిజాన్ని కూడా సాంప్రదాయానికి,మూఢనమ్మకాలకు దూరంగా ఆధునిక ప్రగతికి,స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్య భావనలకు దగ్గరగా నవాయానా బుద్దిస్ట్ ఫిలాసఫీ గా మార్చారు.
ఆయన రెబల్ కాబట్టే Mainstream history booksలలో రాజకీయాలలో 1980 ల దాగా చిన్నచూపు చూశారు..దళిత ఉధ్యమం బలపడిన తర్వాతనే ఆయనను గుర్తించడం ప్రారంభించారు.. అది కూడా ఓట్ల కోసం అని కొత్త గా చెప్పాల్సిన అవసరం లేదు.
మరి ఈనాడు అత్యధిక విగ్రహాలు, ఏ పార్టీ కూడా రాజకీయంగా విస్మరించిన స్థాయిలో గుర్తిస్తున్నారు.. కానీ ఆయన అడిగిన నైతిక,సామాజిక న్యాయ ప్రశ్నలను మటుకు ఎదుర్కొనే ధైర్యం ఎవరూ చేయడం లేదు..సమాధానం తర్వాత సంగతి..
ఎదుర్కొంటే,సమాధానం కోసం అన్వేషిస్తే ఎవరి పీఠాలు,కోటలు కదిలిపోతాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..
Educate Agitate Organize
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి