పోస్ట్‌లు

అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి?

 అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి ?  ఏటికి ఎదురీదడమే గొప్ప సాహసమైతే దానికి సమాంతరంగా మరో   ప్రవాహాన్ని నడపడం ఇంకా గొప్ప సాహసం....దీనికి అంబేద్కర్ జీవిత పోరాటమే గొప్ప ఉదాహరణ... ఇక్కడ ఏరు అంబేద్కర్ విదేశాలలో చదువు పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చిన కాలానికి గాంధీ నాయకత్వంలో ఉవ్వెత్తున సాగుతున్న భారత జాతీయ రాజకీయ స్వాతంత్ర్య ఉధ్యమం. మరి ముందు మీ ఇల్లు చక్క దిద్దుకుంటూ సాటి భారతీయులను సమానంగా చూడండి అప్పుడే మీకు బ్రిటిష్ వారిని వ్యతిరేకించే నైతికత ఉంటుందనే ప్రశ్న ఉధ్యమానికి ఘాటుగానే తగులుతుంది కదా తగిలింది కూడా..అందుకే అంబేద్కర్ ని దేశ ద్రోహి, బ్రిటిష్ ఏజెంట్,ఉధ్యమ ద్రోహి అని బిరుదులిచ్చారు..కాంగ్రెస్ పార్టీ ప్రెస్ ఆయన మీద దాడి చేసింది.. ఆయన నడిపిన  సమాంతర ప్రవాహం సామాజిక సంస్కరణ ఉధ్యమం..దళిత ఉధ్యమ రాజకీయాలు. హిందూ ధర్మంలో సంస్కరణ అంటే హిందువులను  విడదీసి  బ్రిటిష్ వాళ్ళకి సహకరించడంలా భావించిన రోజులు అవి... ఉధ్యమానికి ఆర్థిక సహకారం అడిగితే పేదరికంలో మగ్గిపోతున్న,భూమి లేని దళితులు ఎంతని ఇవ్వగలరు. గట్టిగా కృషి చేస్తే ఐదొందలు వసూలవడానికే గగనమయ్యాయి.. మరి గాంధీ అ...

మోదీ రాజకీయ జీవితంపై నా అభిప్రాయం

 మోదీ రాజకీయ జీవితం పై నా అభిప్రాయం  గుజరాత్ అల్లర్లు జరిగేనాటికి టీనేజ్ వయస్సు లో ఉండడం వలన పెద్దగా ఒక అభిప్రాయంకి రాలేదు ఒక విశ్లేషణ కూడా  చేయలేదు.2007 గుజరాత్ ఎన్నికల సమయానికి వాజపేయి, అద్వానీ ల కనుసన్నలలో బీజేపీ పార్టీ ఉండడంతో మోదీ మీద పెద్దగా దృష్టి నిలపలేదు.2012 గుజరాత్ ఎన్నికలను మటుకు చాలా దగ్గరగా పరిశీలించాను.ఆ ఎన్నికల్లో కమ్యూనల్ అజెండా ఉన్నప్పటికీ అభివృద్ధి,గుజరాత్ ఆత్మగౌరవం మీద ప్రధానంగా ఎన్నికలు జరిగాయి. కాకపోతే గుజరాత్ అల్లర్లలో మోదీ మీద కేసులు కొట్టేయడంతో ఆ అల్లర్ల చరిత్ర ను పెద్ద గా నేను చదవలేదు అలాగే కాంగ్రెస్ పార్టీ విధాన వికలత్వంతో దేశంలో వచ్చిన అసంతృప్తి నాలో కూడా ఉంది.కాంగ్రెసు మీద ఆగ్రహం మోదీ గత చరిత్ర ను పూర్తిగా చదవకుండా చేసిందనే అనుకోవచ్చు.ఇది ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా ఒక రాజకీయ నాయకుడి గురించి పూర్తిగా అధ్యయనం చేయకుండా ఒక అభిప్రాయం(పాజిటివ్ అయితే కాదు నెగిటివ్ అభిప్రాయమే ఉండేది కానీ పూర్తిగా వ్యతిరేకించే విధంగా అయితే లేదు)కి రావడం నేను చేసిన పెద్ద తప్పు.ఇలా 2014 ఎన్నికల సమయానికి మోదీపై పాజిటివ్ అభిప్రాయం లేకపోయినా ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థిత...

భారత దేశంలో భాషావిధానం-హిందీయేతర భాషలకు జరుగుతున్న అన్యాయం-చరిత్రావలోకనం

 భాష భావవ్యక్తీకరణకు,ఉపాధికి,గుర్తింపుకు,సంస్కృతి(కళలు, సాహిత్యం) అభివృద్ధి చేసుకునేందుకు, జ్ఞాన సమూపార్జనకు ప్రధానమైన సాధనం.విభిన్న సంస్కృతులకు సమ్మేళనం ఆలవాలమైన భారత దేశంలో భిన్న భాషలు వివిధ ప్రాంతాలలో మాట్లాడతారు.సహజంగానే ఎవరి మాతృభాష మీద వారికి అభిమానం ఉంటుంది దానిని పరిరక్షించుకోవాలనే తపన ఉంటుంది. ఇతర భాషలను తమకవసరాలకనుగునంగా నేర్చుకోవడానికి ఎవ్వరూ వెనుకాడరు.ఒకవేళ వెనుకాడితే జీవితంలో ముందుకెళ్ళలేమని వారికీ తెలుసు. ఇటీవల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ డ్రాఫ్ట్ నూతన విద్యా విధానంలో హిందీయేతర రాష్ట్రాలలో పాఠశాలలలో హిందీని తప్పనిసరి చేసే ప్రొవిజన్ ఉండడం వివాదానికి తెరలేపింది. ఆర్ ఎస్ ఎస్ నినాదం హిందీ హిందూ హిందూస్థాన్ మనకు తెలిసిందే. బీజేపీ హిందీని అత్యుత్సాహంతో ప్రొమోట్ చేయడంలో భాగంగానే ఇలా ఇతర భాషలను నిర్లక్ష్యం చేయడం మనకు కేంద్ర ప్రభుత్వం హిందీ భాష అభివృద్ధికి,ఇతర భాషల అభివృద్ధి కి పెడుతున్న ఖర్చు దూరం తెలియజేస్తుంది. ఈ విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ముద్దాయిలే. ఒకసారి స్వాతంత్ర్య ఉధ్యమ కాలం నుండి మనదేశంలో భాషావిధానాలు ఎలా మారాయి? వీటివలన దేశంలో విభిన్న భాషల పరిరక్ష...

కులం-నెహ్రూ-అంబేద్కర్

 Oppressed community నుండి వచ్చిన విద్యావంతుడు.. Oppressor community నుండి వచ్చిన విద్యావంతుడు ఒకే వ్యవస్థ ని ఎలా అర్థం చేసుకున్నారో కుల వ్యవస్థ మీద అంబేద్కర్, నెహ్రూ ల అభిప్రాయం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నెహ్రూ Discovery of India లో  Brahmanism(ఒక చోట దీన్ని జాతీయ మతంగా కూడా అభివర్ణించాడు),Caste system, Untouchability ల మీద ఆయన అభిప్రాయాలు చదివితే పూర్తిగా హిందూ ఐడెంటిటీ నుంచి బయటకు రాలేక Caste apologist గా కనపడతాడు..ఇదే భావజాలం పదిహేడేళ్ళ ప్రధానమంత్రిత్వ విధానాల మీద కనపడుతుంది.. 1. తిలక్ బ్రాహ్మణేతరులకు లిబరల్ విద్యని వ్యతిరేకిస్తే నెహ్రూ ప్రాథమిక విద్య ను నిర్లక్ష్యం చేసి అప్పటికే చదువుకున్న వర్గాలకు ఉపయోగపడే IIT,IIM లాంటి Higher education institutions మీద దృష్టి నిలిపాడు.  ప్రాథమిక విద్యకు ఎక్కువ ఆర్థిక వనరులు కూడా అవసరం లేదు..వనరులు లేవనే సాకు చెప్పడానికి... 2. Land reforms state governments కి వదిలేయడం- వైఫల్యం చూస్తూనే ఉన్నాం. అదే నెహ్రూ industries కొచ్చేసరికి జాతీయం చేయడం, License Raj quota తో బ్రిటిష్ కాలం దగ్గర నుండి లబ్దిపొందిన వర్గాలే  స్వాతంత్య...

యుద్ధ విమానాల తయారీ-సొంత సామర్థ్యం

 Note: I am not a defence expert, ఈ పోస్ట్ లో కేవలం పాలసీ విధానాలు, చారిత్రక నేపథ్యం,Operational history  గురించి మాత్రమే రాశాను.సాంకేతిక పరిజ్ఞానం గురించి ఉన్న విషయాలు Public domain లో ఉన్నవే ఉటంకింస్తూ రాశాను. విదేశాల మీద ఎక్కువ ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించవలసిన ముఖ్యమైన రంగాలలో రక్షణ రంగం ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధంలో వాయు సేన(ఎయిర్ ఫోర్స్) ప్రాధాన్యత బాగా పెరిగి సంకీర్ణ దేశాల విజయంలో కీలక పాత్ర వహించింది. గ్రౌండ్ ఫోర్స్ ముందుకు దూసుకెళ్ళడానికి సహకరించడం(Air cover),తక్కువ సమయంలో శత్రువు స్థావరాలను గైడెడ్ మిస్సైల్స్ తో దాడి చేయడం,రసాయన ఆయుధాల దగ్గర నుంచి అణ్వాయుధాల దాకా అన్నిరకాల బాంబులను ప్రయోగించగలిగే సామర్థ్యం యుద్ధ విమానాల(ఫైటర్ జెట్స్) సొంతం.మరి ఇటువంటి కీలకమైన ఫైటర్ జెట్స్ తయారీ లో మన దేశం  స్వయం సమృద్ధి సాధించిందా…??? రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్, బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ల కోసం చిన్న చిన్న ఎయిర్ ఫీల్డ్ లు,spare parts తయారీకి,రిపేర్ కి  ఉన్న ఫ్యాక్టరీలు తప్ప ఇండియా లో ఎయిర్ క్రాఫ్ట్ తయారీ చేసే సామర్థ్యం లేదు. స్వాతంత్య్రం వచ్చేనాటికి బ్రిటిష్ తయారీ యుద్ధ...

రాఫెల్ యుద్ధ విమానం రాక-చైనా మిలటరీ సామర్థ్యం

 మొదటి బ్యాచ్ రాఫెల్  యుద్ధ విమానాల రాకకు..మీడియా ఇస్తున్న కవరేజ్ వాటితో  చైనాతో యుద్ధం గెలిగిచినంత ఇస్తుంది కదా. 🙂..ఏ చిన్న విషయం దొరికినా మోదీ ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చడానికి తెగ తంటాలు పడుతున్న గోదీ మీడియా దిగజారుడుతునాన్ని చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదు.. ఒకసారి మన ఏయిర్ ఫోర్స్ సామర్థ్యం,గణాంకాల లోకి వెళ్తే.. ప్రస్తుతం చైనా, పాకిస్థాన్ వైపు సరిహద్దుల కనీస రక్షణ కు  42 Squadrons ( ఒక్కో  Squadron లో 18 యుద్ధ  విమానాలు ఉంటాయి) ఉండాలని (Sanctioned strength) నిర్ణయించారు. ఇప్పుడు ముప్పై ఆరు రాఫెల్ విమానాలన్నీ  2022లో వచ్చే నాటికి  మన దగ్గర ..32 squadrons కు చేరుకుంటుంది.(Tejas తో కలిపి)..అంటే 2022 నాటికి కూడా ఇంకా పది squadrons (10×18=180) లోటు ఉంటుంది. ప్రస్తుతం 4.0 Generation,4.5 generation,5.0 Generation యుద్ధ విమానాల తరం నడుస్తోంది. మన దగ్గర 28 squadrons  Sukhoi-MKI(4.5 Generation)-12 (Squadrons) MIG-29(4.0G)-3 S Mirage ( 4.0G)- 3 S Jaguar (3.0G)- 6 S   MIG-21 (3.0G)- 3S  Tejas ( 4.0 G) -. 1S ( ఇదొక్కటే మన  సొం...

చైనా మిలటరీ వ్యూహం,దీర్ఘకాలిక లక్ష్యం

 చైనా మిలటరీ strategy ప్రధానంగా  రెండు Tactics మీద ఆధారపడి ఉంటుంది. Sun Tzu అని ప్రాచీన చైనా మిలటరీ వ్యూహకర్త చెప్పినది  ఒకటి  "The supreme art of war is to subdue the enemy without fighting" "పోరాటం  చేయకుండానే శత్రువుని ఓడించడం అనేది గొప్ప యుద్ధ నీతి"  రెండు Salami slicing అంటే  చిన్న చిన్న చర్యలతో direct confrontation లేకుండా శత్రువు శక్తి కోల్పోయేలా చేయడం. ఇప్పుడు చైనా ప్రధాన లక్ష్యం అమెరికాని ఆర్థిక,రాజకీయ, మిలటరీ పరంగా అధిగమించి సూపర్ పవరయ్యి "Chinese dream " ని సాధించడం.అంటే ఒకప్పడు కోల్పోయిన ( యూరోపియన్ వలసీకరణ ముందు చైనా ప్రపంచలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ)అగ్ర స్థానాన్ని సాధించడమనమాట. ఇండియా అనేది చైనాకు చిరాకు మాత్రమే అంటే పెద్ద ప్రమాదం లేకుండా అప్పుడప్పుడు చిరాకు కలిగించే దేశమనమాట.గత రెండు దశాబ్దాలుగా ఆర్థిక సంబంధాలు మెరుగపడినప్పటికీ ఇండియా ప్రధానంగా ముడిపదార్ధాలు ఎగుమతి చేసే దేశంగా ఉంటూ ఏభై బిలియన్ల డాలర్లు వాణిజ్య లోటు ఉంది చైనాతో. గత మూడు దశాబ్దాలలో చైనా బోర్డర్ లో ఒక్క బులెట్ కూడా కాల్చకుండా సరిహద్దు దగ్గర ప్రశాంత వాతావరణం ఉంది, అప్పుడప...