యుద్ధ విమానాల తయారీ-సొంత సామర్థ్యం
Note: I am not a defence expert, ఈ పోస్ట్ లో కేవలం పాలసీ విధానాలు, చారిత్రక నేపథ్యం,Operational history
గురించి మాత్రమే రాశాను.సాంకేతిక పరిజ్ఞానం గురించి ఉన్న విషయాలు Public domain లో ఉన్నవే ఉటంకింస్తూ రాశాను.
విదేశాల మీద ఎక్కువ ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించవలసిన ముఖ్యమైన రంగాలలో రక్షణ రంగం ఒకటి.
రెండవ ప్రపంచ యుద్ధంలో వాయు సేన(ఎయిర్ ఫోర్స్) ప్రాధాన్యత బాగా పెరిగి సంకీర్ణ దేశాల విజయంలో కీలక పాత్ర వహించింది.
గ్రౌండ్ ఫోర్స్ ముందుకు దూసుకెళ్ళడానికి సహకరించడం(Air cover),తక్కువ సమయంలో శత్రువు స్థావరాలను గైడెడ్ మిస్సైల్స్ తో దాడి చేయడం,రసాయన ఆయుధాల దగ్గర నుంచి అణ్వాయుధాల దాకా అన్నిరకాల బాంబులను ప్రయోగించగలిగే సామర్థ్యం యుద్ధ విమానాల(ఫైటర్ జెట్స్) సొంతం.మరి ఇటువంటి కీలకమైన ఫైటర్ జెట్స్ తయారీ లో మన దేశం స్వయం సమృద్ధి సాధించిందా…???
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్, బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ల కోసం చిన్న చిన్న ఎయిర్ ఫీల్డ్ లు,spare parts తయారీకి,రిపేర్ కి ఉన్న ఫ్యాక్టరీలు తప్ప ఇండియా లో ఎయిర్ క్రాఫ్ట్ తయారీ చేసే సామర్థ్యం లేదు.
స్వాతంత్య్రం వచ్చేనాటికి బ్రిటిష్ తయారీ యుద్ధ విమానాలు, రెండవ ప్రపంచ యుద్ధం లో పాల్గొన్న అనుభవం ఉన్న పైలట్లు ఇదీ మన వాయుసేన పరిస్థితి..
1950లలో సొంతగా ఫైటర్ జెట్ తయారీ కి సన్నాహాలు చేసి 1964 నాటికి.. హిందూస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లిమిటెడ్ (HAL) మారుత్ ని సర్వీసు లోకి తేగలిగాము.
ఆసియా లోనే సొంత గా ఫైటర్ జెట్ ని తయారు చేయగలిగే మొదటి దేశం గా..భారత్ అవతరించింది.(జపాన్ కి ఆ సామర్థ్యం ఉన్నా రెండవ ప్రపంచ యుద్ధ షరతుల ప్రకారం దీనిపై దృష్టి సారించలేదు.)
అయితే ఇంజన్ సామర్థ్యం, వేగం వంటి సాంకేతిక పరిజ్ఞానంలో సరైన అభివృద్ధి జరగక...147 మాత్రమే తయారు చేసి 1980లలో కొచ్చేసరికి సర్వీసు నుండి రిటైరైంది.
ఒకవైపు పాకిస్థాన్ అమెరికా వెన్నుదన్నుతో ఆధునిక ఫైటర్ జెట్స్ సమకూర్చుకొని 1965 యుద్ధం లో మన వాయుసేన కు తీవ్ర నష్టం కలిగించింది.. దీనితో తర్వాతి కాలంలో సొంతంగా ఫైటర్ జెట్స్ తయారీ మీద పెద్ద గా దృష్టి నిలపకుండా..సోవియట్ యూనియన్, బ్రిటన్, ప్రాన్స్ ల మీద ఆధారపడడం జరిగింది..
1974 అణుపరీక్షలు నిర్వహించాక అమెరికా,బ్రిటన్ లాంటి దేశాలు మనపై విధించిన మిలటరీ సాంకేతిక పరిజ్ఞానపు ఆంక్షలు కూడా రక్షణ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి.
వేగంగా మారుతున్న ఏరోస్పేస్ టెక్నాలజీనీ అందుకోవడంలో మనం విఫలమై దిగుమతులు మీద ఆధారపడడం అలవాటైపోయింది..
చివరకు 1980 లలో సొంతంగా రెండో ఫైటర్ జెట్ తయారీ కి ప్రణాలికలు వేస్తే తేజస్ తేలికపాటి యుద్ధ విమానం (Tejas Light combat aircraft ) 2015 లో సర్వీసు లోకి తేగలిగాము. ఇది నాలుగో తరం ఫైటరైనప్పటికి కీలకమైన జెట్ ఇంజన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నదే.
ఇప్పుడు వాడుతున్న యుద్ధ విమానాలు
రష్యా నుంచి సుఖోయ్,మిగ్
ఫ్రాన్స్ నుంచి మిరాజ్,జాగ్వార్ (ఆంగ్లో-ఫ్రెంచ్ సంయుక్త తయారీ),ఇప్పుడు రాఫెల్.
భారత్-తేజస్.
చైనా ఇప్పుడు నాలుగో తరం ఫైటర్ జెట్స్ తయారీ లో స్వయం సమృద్ధి సాధించి ఐదోతరం J-20 జెట్స్ ని కూడా సర్వీసు లోకి తేగలిగింది.కీలకమైన జెట్ ఇంజన్ తయారీ లో చైనా కూడా పూర్తిగా విజయవంతమవ్వలేదు.ఈ పరిజ్ఞానంలో అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ దేశాలు తప్ప వేరే ఏ దేశం ఇంకా పూర్తిగా విజయం సాధించలేదు.
వైఫల్యానికి కారణాలు:
మొదటి నుండి అమెరికా వెన్నుదన్నుతో పాకిస్థాన్ ఆధునిక విమానాలు దిగుమతి చేసుకోవడం వలన భారత్ కు సొంత తయారీ ఎక్కువ కాలం పట్టేట్లు ఉండటంతో సాంకేతికతకు తూగడం కోసం దిగమతులు మీద ఆధారపడడం జరిగింది.
1974, 1998 అణుపరీక్షల తర్వాత అమెరికా, జపాన్ లాంటి దేశాలు విధించిన మిలటరీ ఆంక్షలు.
Fighter Jet development అనేది చాలా ఖర్చు తో కూడుకున్న వ్యవహారం.మన రక్షణ బడ్జెట్ పరిమితులు.
ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలపై పూర్తిగా ఆధారపడడం.
Spare parts తయారీకి ప్రైవేటు సంస్థలకు మొదటి నుండి అవకాశం ఇచ్చి ఉంటే ఒక ecosystem అభివృద్ధి చెంది ఉండి త్వరితగతిన లక్ష్యాలు చేరుకునే అవకాశం ఉండేది.
మొదటి నుండి Space technology మీద పెట్టిన దూర దృష్టి ఈ రంగం మీద పెట్టకపోవడం.
చివరగా చైనా కి మనకి ఇప్పటిదాకా ఎయిర్ ఫోర్స్ సామర్థ్య విషయంలో సంఖ్యలో తప్ప ఆధునికతలో పెద్ద గా అంతరం లేదు.కానీ మున్ముందు పాశ్చాత్య దేశాల స్థాయి ని కూడా చైనా అధిగమిస్తుందన్న విషయంలో సందేహం లేదు.
సొంత తయారీ ఎకో సిస్టం పూర్తిగా అభివృద్ధి చెందడంతో అమెరికాకే సవాల్ విసురుతున్న చైనాకి మనకి కనీసం రెండు దశాబ్దాల పాటు అంతరం వేగంగా పెరగనుంది...అందుకోవడం కష్టమే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి