చైనా మిలటరీ వ్యూహం,దీర్ఘకాలిక లక్ష్యం
చైనా మిలటరీ strategy ప్రధానంగా రెండు Tactics మీద ఆధారపడి ఉంటుంది.
Sun Tzu అని ప్రాచీన చైనా మిలటరీ వ్యూహకర్త చెప్పినది
ఒకటి
"The supreme art of war is to subdue the enemy without fighting"
"పోరాటం చేయకుండానే శత్రువుని ఓడించడం అనేది గొప్ప యుద్ధ నీతి"
రెండు Salami slicing అంటే చిన్న చిన్న చర్యలతో direct confrontation లేకుండా శత్రువు శక్తి కోల్పోయేలా చేయడం.
ఇప్పుడు చైనా ప్రధాన లక్ష్యం అమెరికాని ఆర్థిక,రాజకీయ, మిలటరీ పరంగా అధిగమించి సూపర్ పవరయ్యి "Chinese dream " ని సాధించడం.అంటే ఒకప్పడు కోల్పోయిన ( యూరోపియన్ వలసీకరణ ముందు చైనా ప్రపంచలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ)అగ్ర స్థానాన్ని సాధించడమనమాట.
ఇండియా అనేది చైనాకు చిరాకు మాత్రమే అంటే పెద్ద ప్రమాదం లేకుండా అప్పుడప్పుడు చిరాకు కలిగించే దేశమనమాట.గత రెండు దశాబ్దాలుగా ఆర్థిక సంబంధాలు మెరుగపడినప్పటికీ ఇండియా ప్రధానంగా ముడిపదార్ధాలు ఎగుమతి చేసే దేశంగా ఉంటూ ఏభై బిలియన్ల డాలర్లు వాణిజ్య లోటు ఉంది చైనాతో.
గత మూడు దశాబ్దాలలో చైనా బోర్డర్ లో ఒక్క బులెట్ కూడా కాల్చకుండా సరిహద్దు దగ్గర ప్రశాంత వాతావరణం ఉంది, అప్పుడప్పుడు నియంత్రణ రేఖ దగ్గర చిన్న చిన్న సంఘటనలు తప్ప.
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా పోతూ,పాకిస్థాన్ ఓడరేవుల ద్వారా అరేబియా సముద్రం, పర్షియన్ గల్ఫ్,ఎర్ర సముద్రం దగ్గర మార్గం దొరుకుతుంది.
చైనా 1962 యుద్ధం జరిగిన దగ్గర నుంచి పాకిస్థాన్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉంది.అది ఈ ఎకనమిక్ కారిడార్ తో ఇంకా బలపడుతూ వస్తుంది.ఇండియా తో ప్రత్యక్షంగా తలపడే అవసరం లేకుండా పరోక్షంగా పాకిస్థాన్ ద్వారా నియంత్రణ చేస్తుంది.ఇది పైన చెప్పిన మొదటి tactic కిందకు వస్తుంది.
ఇక బోర్డర్ దగ్గర కూడా ఇండియా తనతో సమానంగా ఏ జోన్లో కూడా infrastructure అభివృద్ధి చేయకుండా advantage సాధించకుండా చూడడం కోసం అప్పుడప్పుడు నియంత్రణ రేఖ దాటి తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేస్తూ చికాకు కల్పిస్తూ ఉంటుంది.ఈ శిబిరాలను తీయాలంటే Aggressive infrastructure అభివృద్ధి మీద ఆంక్షలు పెట్టడం,దలైలామా విషయం,అమెరికా, జపాన్ లాంటి దేశాలతో ఇండియా సంబంధాల పై పరోక్షంగా ప్రభావితం చేస్తుంది.
ఇండియా వలన చైనాకి సమీప భవిష్యత్తులో మిలటరీ ప్రమాదమైతే లేదు కానీ పాకిస్థాన్ ద్వారా పరోక్షంగా కట్టడి చేస్తుంది.
చైనా ప్రారంభించిన బిలియన్ డాలర్ల Belt and Road project లో పాల్గొనడానికి నిరాకరించడం,ఇటీవలి భూటాన్ డోక్లామ్ standoff,జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హొదా రద్దు చేయడం చైనాకి బాగా చిరాకు తెప్పించాయి.
గత ఆరేళ్ళలో దేశ వ్యాప్తంగా పెరిగిన మత అనైక్యత,ఐసీయూలో ఉన్న ఆర్థిక పరిస్థితి వలన ఇండియా ఇంకా దయనీయ పరిస్థితిలోకెళ్ళింది.
పొద్దున లెగిస్తే
పాకిస్థాన్ నామ స్మరణ చేసె మోదీ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ లో చేసిన దుందుడుకు చర్య
వలన లక్షల మంది సైన్యం ఆ బోర్డర్ వైపు ఉంచాల్సి వచ్చింది.
ప్రత్యక్ష యుద్ధం తనకూ నష్టమని చైనాకి తెలుసు అందుకే ఇలా పరోక్ష కార్యాకలాపాలతో ఇండియాని నియంత్రిస్తుంది.అయితే ఇప్పుడు లడఖ్ లో మూడు నాలుగు చోట్ల Aggressive posture తో ఇండియా కి పరీక్ష పెడుతుంది.
నిజమైన దేశ భద్రత మిలటరీ లోనే కాదు సుస్థిరమైన ఆర్థిక అభివృద్ధి, సామాజిక సామరస్యత, పొరుగు దేశాలతో సత్సంబంధాలలో ఉంటుంది. మిగతా మూడింటిలో విఫలమైతే మిలటరీ బలం(ఆర్థిక వృద్ధి మీదే మిలటరీ ఖర్చు ఆధారపడి ఉంటుంది) కూడా తగ్గిపోతుంది.
పాకిస్థాన్ మీద రంకెలు వేయడం కాదు చైనాతో తలపడడమంటే.ఐదు రెట్ల పెద్ద ఆర్థిక వ్యవస్థ, మూడున్నర రెట్ల పెద్ద మిలటరీ బడ్జెట్, యుద్ధ విమానాల దగ్గర నుంచి ట్యాంకుల దాకా సొంతంగా తయారు చేయకలిగే అభివృద్ధి చెందిన ఆధునిక మిలటరీ వ్యవస్థ కలిగి ఉన్న చైనాకి డెబ్బై శాతం మిలటరీ ఎక్విప్మెంట్ దిగుమతి చేసుకునే ఇండియాకి పోలికే లేదు.
మతం విద్వేషాలతో దేశంలో మత సామరస్యాన్ని దెబ్బ తీస్తూ డీమానిటైజేషన్ లాంటి తిక్క నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ ని అతలాకుతలం చేస్తూ,ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులని ముద్ర వేస్తూ ఎన్నికల్లో గెలవడం,హిందూత్వనే ప్రధాన అజెండాగా దూసుకెళ్తున్న 56" ప్రధాన సేవకుడికి,ఆయన భక్తులకు ఇవన్నీ అర్థమౌతాయా 🙄🤔🤔🤔
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి