రాఫెల్ యుద్ధ విమానం రాక-చైనా మిలటరీ సామర్థ్యం

 మొదటి బ్యాచ్ రాఫెల్  యుద్ధ విమానాల రాకకు..మీడియా ఇస్తున్న కవరేజ్ వాటితో  చైనాతో యుద్ధం గెలిగిచినంత ఇస్తుంది కదా.

🙂..ఏ చిన్న విషయం దొరికినా మోదీ ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చడానికి తెగ తంటాలు పడుతున్న గోదీ మీడియా దిగజారుడుతునాన్ని చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదు..

ఒకసారి మన ఏయిర్ ఫోర్స్ సామర్థ్యం,గణాంకాల లోకి వెళ్తే..

ప్రస్తుతం చైనా, పాకిస్థాన్ వైపు సరిహద్దుల కనీస రక్షణ కు 

42 Squadrons ( ఒక్కో  Squadron లో 18 యుద్ధ  విమానాలు ఉంటాయి) ఉండాలని (Sanctioned strength) నిర్ణయించారు.

ఇప్పుడు ముప్పై ఆరు రాఫెల్ విమానాలన్నీ  2022లో వచ్చే నాటికి  మన దగ్గర ..32 squadrons కు చేరుకుంటుంది.(Tejas తో కలిపి)..అంటే 2022 నాటికి కూడా ఇంకా పది squadrons (10×18=180) లోటు ఉంటుంది.


ప్రస్తుతం 4.0 Generation,4.5 generation,5.0 Generation యుద్ధ విమానాల తరం నడుస్తోంది.

మన దగ్గర 28 squadrons 

Sukhoi-MKI(4.5 Generation)-12 (Squadrons)

MIG-29(4.0G)-3 S

Mirage ( 4.0G)- 3 S

Jaguar (3.0G)- 6 S 

 MIG-21 (3.0G)- 3S 

Tejas ( 4.0 G) -. 1S ( ఇదొక్కటే మన  సొంతది,దీనిలో కూడా కీలకమైన ఇంజన్ దిగుమతి చేసుకునేదే).


చైనా  ఏయిర్ ఫోర్స్ 

దాదాపు 100 squadrons తో 

తొంబై శాతం దాకా అన్ని విమానాలు  సొంతంగా తయారీలో ఉన్నవే.ఇందులో 40 squadrons,4.0 generation కి చెందినవి ఉన్నాయి.

రష్యా, అమెరికాలంత టెక్నాలజీ కి తూగకపోయినా 

సొంత గా తయారీ రంగం అభివృద్ధి చెందడం వలన 

తక్కువ ఖర్చుతో. ..రక్షణ రంగ సామర్థ్యం బలపరచుకుంది.

అదీకాక గత శతాబ్ద కాలంలో డ్రోన్ల తయారీ లో చైనా ఆరితేరింది.

Attack Helicopters,Drones, Electronic warfare, space warfare, Missile defence system లాంటి విషయాలలో..మనకన్నా చాలా ముందుంది..


బిలియన్ల డాలర్లు పెట్టి దిగుమతి చేసుకున్న యుద్ధ విమానాలు చూసి మురిసిపోవడం..ఈమధ్య భజన చేసే మీడియా తోపాటు రాజకీయ రంగు పులుముకుంటున్న ఆర్మీ కూడా ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమౌతుంది....

 ప్రశ్నిస్తే దేశ ద్రోహులు 

పొగిడితే దేశ భక్తులు..ఇదే తంతు..

స్వీయ సామర్థ్యం, బలహీనతలెరిగి ముందుకు

పోవాలి... అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు కాదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మోదీ రాజకీయ జీవితంపై నా అభిప్రాయం

అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి?