కులం-నెహ్రూ-అంబేద్కర్
Oppressed community నుండి వచ్చిన విద్యావంతుడు.. Oppressor community నుండి వచ్చిన విద్యావంతుడు ఒకే వ్యవస్థ ని ఎలా అర్థం చేసుకున్నారో కుల వ్యవస్థ మీద అంబేద్కర్, నెహ్రూ ల అభిప్రాయం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
నెహ్రూ Discovery of India లో
Brahmanism(ఒక చోట దీన్ని జాతీయ మతంగా కూడా అభివర్ణించాడు),Caste system, Untouchability ల మీద ఆయన అభిప్రాయాలు చదివితే పూర్తిగా హిందూ ఐడెంటిటీ నుంచి బయటకు రాలేక Caste apologist గా కనపడతాడు..ఇదే భావజాలం పదిహేడేళ్ళ ప్రధానమంత్రిత్వ విధానాల మీద కనపడుతుంది..
1. తిలక్ బ్రాహ్మణేతరులకు లిబరల్ విద్యని వ్యతిరేకిస్తే నెహ్రూ ప్రాథమిక విద్య ను నిర్లక్ష్యం చేసి అప్పటికే చదువుకున్న వర్గాలకు ఉపయోగపడే IIT,IIM లాంటి Higher education institutions మీద దృష్టి నిలిపాడు.
ప్రాథమిక విద్యకు ఎక్కువ ఆర్థిక వనరులు కూడా అవసరం లేదు..వనరులు లేవనే సాకు చెప్పడానికి...
2. Land reforms state governments కి వదిలేయడం- వైఫల్యం చూస్తూనే ఉన్నాం.
అదే నెహ్రూ industries కొచ్చేసరికి జాతీయం చేయడం, License Raj quota తో బ్రిటిష్ కాలం దగ్గర నుండి లబ్దిపొందిన వర్గాలే స్వాతంత్య్రం వచ్చాక కూడా ఆధిపత్యం వహించి సంపద కేంద్రీకృతమై ఆర్థిక అసమానతలు పెరగటానికి దోహద పడింది..
రెండో పంచవర్ష ప్రణాలిక దగ్గర నుంచి Labour intensive వ్యవసాయ రంగం పై దృష్టి తగ్గిపోయింది.
3.అంబేద్కర్ Obc లకి కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని పట్టబడితే పట్టించుకోలేదు..ఉన్న sc,st లకు ఉన్న రిజర్వేషన్లని కూడా ప్రతిభ అడ్డంకని మొదటి నుంచి మొక్కుబడిగా అమలు చేయడంలో సామాజిక న్యాయం,Representation గురించి నెహ్రూ అవగాహన రాహిత్యం కనపడుతుంది.
ఇవి ఉదాహరణకు చెప్పాను..
కొంతమంది నన్ను అడుగుతుంటారు ఎందుకు ఎప్పుడూ చరిత్ర ని తొవ్వి అందరి మీద విరుచుకుపడుతుంటావు అని..ముందుగా నేను చరిత్ర విద్యార్థిని,ఉపాధ్యాయుడిని..అందుకే నా పోస్ట్ లలో చరిత్ర ఎప్పుడూ భాగంగా ఉంటుంది.అలాగే ఆ ప్రశ్న అడిగిన
వాళ్ళు గమనించాల్సింది పైన నెహ్రూ వ్యక్తపరచిన భావజాలమే ఇప్పటికీ upper caste indians లో ఉంది.
రిజర్వేషన్లు-ప్రతిభకి లింక్ పెట్టి వాటిమీద వ్యతిరేక భావన కలిగి ఉండడం(నెహ్రూ ఈ విషయం మీద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఉత్తరాలు రాశాడు).
అంటరానితనం,కులవ్యవస్థ ద్వారా అణిచివేత కు గురౌతున్న వారిని అర్థం చేసుకోలేకపోవడం.
(ఒక మీటింగ్ లో అంటరానితనమనేది నేను ప్రత్యేక సమస్య గా చూడను జగజ్జీవన్ రామ్ మీద ఆగ్రహం వ్యక్త పరిచాడు నెహ్రూ)
కుల వ్యవస్థ ని Division of labour గా మాత్రమే చూస్తూ దాని సామాజిక వివక్ష స్వభావాన్ని అర్థం చేసుకోకపోవడం.
అంబేద్కర్ అందుకే నెహ్రూ మీద అంత తీవ్రమైన విమర్శలు చేశాడు.. పడేవాడికి తెలిసిన బాధ ఒడ్డున ఉన్నవాడికి తెలియదు కదా..
"If you have a genuinely historical consciousness, you better have a willingness to explore really dark and evil spaces, and that history and guilt are often inexorably tied together"
-------Gunter Grass
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి