నెహ్రూ కంటే పటేల్ బోస్ లు మెరుగైన నాయకత్వం అందించేవారా -చరిత్ర లో ఉదాహరణ
రెండవ ప్రపంచ యుద్ధం-భారతీయ స్వాతంత్ర్య ఉధ్యమ నాయకత్వ నైతిక డైలమా……
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యాక 1940లలో నాజీ జర్మనీ యూరోప్ లో వరుసగా సాధించిన విజయాలు, ఫాసిస్టు జపాన్ సింగపూర్,బర్మాలపై విజయాలు చూసిన తర్వాత యాక్సిస్ కూటమి దేశాలు సంకీర్ణ కూటమి(అమెరికా, యూకే….)మీద విజయం సాధిస్తాయని పటేల్, గాంధీలతో సహా చాలామంది నిర్ణయానికొచ్చారు..
బర్మా రంగూన్ దాకా వచ్చిన జపాన్ ను ఎలా ఎదుర్కోవాలా అని డైలమాలో పడ్డారు..
1942 అల్హాబాద్ లో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దీని మీద మల్లగుల్లాలు పడింది…
బ్రిటిష్ ఇండియాని జపాన్ నుంచి కాపాడలేరు కావున ఏదోవిధంగా జపాన్ తో ఒప్పందం కుదుర్చుకోవాలి వాళ్ళ యుద్ధం బ్రిటిష్ తో కాబట్టి ఇండియా నుంచి జపనీస్ ఆర్మీ మధ్య ప్రాశ్చ (Middle East-West Asia ) దేశాలకు వెళ్ళేవిధంగా సహకరిస్తే ఇక్కడ పౌరుల మీద దాడులు చేయరు అని గాంధీ మొదటి రోజు ముసాయిదా తీర్మానం తయారు చేశారు..
అంటే ఫాసిస్టు జపాన్ ప్రణాలికలో ఇండియా ఆక్రమణ లేదు అనే ఆలోచన తో ఈ ముసాయిదా ఉందనమాట..
దీనికి నెహ్రూ విభేధించాడు..
యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి బ్రిటిష్ కి మద్దతు తెలుపకపోయినా నాజీ-ఫాసిస్టు జర్మనీ, జపాన్లకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ వైఖరి ఉంది..ఇప్పుడు జపాన్ విజయం సాధిస్తుంది కాబట్టి మన స్వార్థం అంటే ఇక్కడ భారత దేశ జాతీయ ప్రయోజనాలు తప్పితే నైతికంగా జపాన్ వారికి సహకరించడం సరైన విధానం కాదు అని నెహ్రూ, మౌలానా ఆజాద్ లు గాంధీ ముసాయిదాతో విభేధించారు..
ఇక్కడ గాంధీ వైఖరికి నాజీలతో ప్రత్యక్షంగా చేతులు కలిపిన బోస్ కి పెద్దగా తేడా కనపడదు..
ఒకప్పుడు ముస్సోలినీని కలిసి ఇటలీలో క్రమశిక్షణ,పెట్టుబడి-కార్మికుల మధ్య సమన్వయం, పేదరికం పై విధానం లాంటి వి చూసి పొగిడిన గాంధీ
హిట్లర్ వరుస విజయాలు చూశాక బ్రిటిష్ వారిని లొంగిపోమని మీ బిల్డింగ్లు,నగరాలు స్వాధీనం చేసుకుంటారేమో గాని మీ ఆత్మలను కాదని సలహా ఇచ్చాడు..
హిట్లర్ అనుకున్నంత చెడ్డవాడు కాదు అవసరమైతే బ్రిటిష్ క్యాబినెట్ ఆహ్వానిస్తే హిట్లర్ తో శాంతి చర్చలకు నేను వెళ్తానని బ్రిటిష్ వైస్రాయ్ కి ఉత్తరం రాశాడు..
ఇక సుభాష్ చంద్రబోసైతే హిట్లర్ ని అంచనా వేయడంలో చాలా పొరపడ్డాడు..
కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనా గాంధీ పరోక్ష వ్యతిరేకతతో తను అనుకున్నట్లుగా పార్టీ ని నడపలేకపోవడంతో అసంతృప్తి చెంది ఇండియానుండి జర్మనీ చేరాడు..
హిట్లర్ బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకి కాడు..వారి వలసలలో జర్మనీ కి కూడా భాగం కావాలి అనుకోరుకున్నాడే తప్ప ఇండియాకి స్వాతంత్య్రం పొందే అర్హత లేదని తన మెయిన్ కాంఫ్ పుస్తకంలో భారతీయులపై చిన్న చూపు వ్యక్తం చేశాడు..
జర్మనీ లో ఉన్నప్పుడు గానీ తర్వాత జపాన్ వెళ్ళిన తర్వాత గానీ యూదులపై జరిగిన దమనకాండ గురించి బోస్ విచారం వ్యక్తం చేసిన ఆధారాలు లేవు..
ఒకప్పుడు భారతీయులకు స్వాతంత్య్రం,సమానత్వం కోరుతూ వేరే జాతీయుల పై జరిగిన దమన కాండపై నిశ్శబ్దంగా ఉండడం నైతిక నాయకత్వం అనిపించుకోదు..
ఇక్కడ బోస్ బ్రిటిష్ కి నాజీ-ఫాసిస్టు జర్మనీ-జపాన్లకు ఉన్న తేడా చూడలేదు..
ఎంత జాతీయ స్వాతంత్ర్య ఉధ్యమమైనా,దేశ భక్తైనా ఇటువంటి దమనకాండలపై నిశ్శబ్దంగా ఉండటం బోస్ జీవితంలో పెద్ద నైతికత ప్రశ్న నే..
నెహ్రూ, ఆజాద్ లు గాంధీ క్విట్ ఇండియా ఉధ్యమ తీర్మానానికి వ్యతిరేకించే సాహసం చేయలేదు..
గాంధీ బోస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కూడా నియంతృత్వ పోకడలు ఉంటాయి..ఇందులో పటేల్ కాంగ్రెస్ రైట్ వింగ్ కి నాయకత్వం వహిస్తున్న పటేల్ పాత్ర కూడా ఉంది..
ఈ చారిత్రక పరిణామాలు,నాయకుల వైఖరిపై ఇప్పుడు నైతిక తీర్పులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో గానీ వారి నిర్ణయాలను వాటి పర్యావసానాలను హేతుబద్దంగా విమర్శలు చేయడమనేది చరిత్ర ని అర్థం చేసుకోవడంలో ప్రధాన అంశం..
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మన జాతీయ స్వాతంత్ర్య ఉధ్యమ ప్రధాన నాయకత్వంలో కాస్తో కూస్తో అంతర్జాతీయ పరిణామాలను అర్థం చేసుకుంది నెహ్రూ అందుకే గాంధీ ని పూర్తిగా వ్యతిరేకించే సాహసం చేయకపోయినా ఫాసిజానికి, నాజీయిజానికి పరోక్షంగానైనా అనుకూలంగా ఎప్పుడూ వ్యవహరించలేదు..
ఇప్పుడు సంఘ్-బీజేపీ బ్యాచ్ నెహ్రూ పై ద్వేషానికి ప్రధానంగా వాడుతున్న ఆయుధాలు
నెహ్రూ కి బోస్, పటేల్ కి ఉన్న విబేధాలు..
ఎవరి బలాలు బలహీనతలు ఎలా ఉన్నా ముగ్గురిలో నెహ్రూ మెరుగైన నాయకుడు అని భావించి గాంధీ తన వారసుడిగా ప్రకటించాడు..
పటేల్ సాంప్రదాయ వైఖరి, హిందూ కోడ్ బిల్లు, విభజన సమయంలో ముస్లింలపై ఆయన వైఖరి ఆధునికతకు దూరంగా వివాదాస్పదంగా ఉంటుంది..
ఇక బోస్ ఫాసిజానికి, నియంతృత్వ సామ్యవాదానికి ఆకర్షితులవడం,నాజీ-ఫాసిజంతో చేతులు కలపడం లాంటివి చూస్తే ప్రజాస్వమ్యానికి ఏమాత్రం నిబద్ధత కలిగి ఉండేవాడో అనుమానం కలుగుతుంది..
రైట్ వింగ్ ప్రచారం చేస్తున్నట్లు గా పటేల్, బోస్ లు నెహ్రూ కన్నా మైరుగైన ప్రధానమంత్రులయ్యేవారే అనే ఊహాత్మక ప్రశ్నలకు చరిత్రలో సరైన ఉదాహరణలు లేవు..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి