భారత దేశంలో భాషావిధానం-హిందీయేతర భాషలకు జరుగుతున్న అన్యాయం-చరిత్రావలోకనం

 భాష భావవ్యక్తీకరణకు,ఉపాధికి,గుర్తింపుకు,సంస్కృతి(కళలు, సాహిత్యం) అభివృద్ధి చేసుకునేందుకు, జ్ఞాన సమూపార్జనకు ప్రధానమైన సాధనం.విభిన్న సంస్కృతులకు సమ్మేళనం ఆలవాలమైన భారత దేశంలో భిన్న భాషలు వివిధ ప్రాంతాలలో మాట్లాడతారు.సహజంగానే ఎవరి మాతృభాష మీద వారికి అభిమానం ఉంటుంది దానిని పరిరక్షించుకోవాలనే తపన ఉంటుంది. ఇతర భాషలను తమకవసరాలకనుగునంగా నేర్చుకోవడానికి ఎవ్వరూ వెనుకాడరు.ఒకవేళ వెనుకాడితే జీవితంలో ముందుకెళ్ళలేమని వారికీ తెలుసు.

ఇటీవల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ డ్రాఫ్ట్ నూతన విద్యా విధానంలో హిందీయేతర రాష్ట్రాలలో పాఠశాలలలో హిందీని తప్పనిసరి చేసే ప్రొవిజన్ ఉండడం వివాదానికి తెరలేపింది. ఆర్ ఎస్ ఎస్ నినాదం హిందీ హిందూ హిందూస్థాన్ మనకు తెలిసిందే. బీజేపీ హిందీని అత్యుత్సాహంతో ప్రొమోట్ చేయడంలో భాగంగానే ఇలా ఇతర భాషలను నిర్లక్ష్యం చేయడం మనకు కేంద్ర ప్రభుత్వం హిందీ భాష అభివృద్ధికి,ఇతర భాషల అభివృద్ధి కి పెడుతున్న ఖర్చు దూరం తెలియజేస్తుంది.

ఈ విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ముద్దాయిలే.

ఒకసారి స్వాతంత్ర్య ఉధ్యమ కాలం నుండి మనదేశంలో భాషావిధానాలు ఎలా మారాయి?

వీటివలన దేశంలో విభిన్న భాషల పరిరక్షణ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? 

హిందీయేతర భాషలవారు ఎదుర్కొంటున్న వివక్ష ఏమిటి? 

హిందీ భాషా ప్రాంతాలలోనే ఉన్నటువంటి విభిన్న మాండలికాలను ఎంతవరకు గుర్తించి అభివృద్ధి చేశారు? 

అసలు రాజ్యాంగంలో  మన భాషావిధానానికి సంబంధించిన అధికరణలు ఏమిటి? వాటి అమలు ఎలా జరుగుతుంది ? 

లాంటి ప్రశ్నలకు ఈ పోస్ట్లో ఒకసారి సమాధానాలు రాబడదాం.


మొఘలుల కాలంలో ఆస్థాన భాషగా ఉన్న పర్షియన్ భాషను బ్రిటిషర్స్ కొన్నాళ్ళు కొనసాగించారు. అయితే 1830లలో పాఠశాల, కళాశాల విద్య  ఏ భాషలో ఉండాలి అనే వివాదంలో ప్రాథమిక విద్య మాతృభాష అంటే స్థానిక భాషలో కొనసాగించి కళాశాలలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు.అదే విధానం దాదాపుగా స్వాతంత్య్రం వచ్చేదాకా కొనసాగింది.దీనివలన లోపాలు

1. ఉన్నత విద్య దేశీయ భాషలలో లేకపోవడం వలన ఏ భారతీయ భాషలో కూడా ఆధునిక పదజాలం అంటే సాంకేతిక,సైన్సు పదజాలం అభివృద్ధి చెందలేదు.

2 విద్య అన్ని వర్గాలకు అందకుండా కులీనవర్గాలకే పరిమితమైంది.

భారత స్వాతంత్ర్య ఉధ్యమ కాలంలో కాంగ్రెస్ భిన్న భాషలను గౌరవిస్తూనే భాషాప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుకు అనుకూలంగా ఉండేది. ఈ విధానంలో భాగంగానే 1920లలోనే ప్రతీ ప్రాంతానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేశారు. అంటే మద్రాసు రాష్ట్రంలో భాగమైనా ఆంధ్రాకి ప్రత్యేక కాంగ్రెసు శాఖ ఉండేదనమాట.ఈకాలంలోనే స్వాతంత్ర్య భారతంలో జాతీయ భాషగా ఏది ఉండాలనే దానిమీద కాంగ్రెస్ లో చర్చలు జరిగాయి. గాంధీ నెహ్రూ లు హిందీ, ఉర్దూ కలిసిన అప్పట్లో బాగా జన సామాన్యంలో ఉన్న హిందూస్థాని భాషను జాతీయ భాషగా చేయాలని అనుకున్నారు.ఇందులో వారు హిందూ-ముస్లిం ఐక్యత ప్రధానంగా ఆలోచించారు.కానీ కాంగ్రెసు లోని హిందూవాదులు దీనికి ఒప్పుకోలేదు.ఉర్దూ పదాలు కలవడం వారికి ఇష్టం లేదు.వారు సంస్కత పదజాలంతో ప్రభావితమైన sanskritized Hindi ని కోరుకున్నారు.


రాజ్యాంగ సభలో అత్యంత వాడివేడిగా చర్చ జరిగింది ఈ విషయం మీదనే.చివరకుఒక్క ఓటు మెజార్టీ తో హిందీ భాష(దేవనాగరి లిపిలో)ని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తించారు.అంటే జాతీయ భాష కాదు.జాతీయ భాష అంటే రాష్ట్రాలు,స్థానిక ప్రభుత్వాలు,కేంద్రంలో ఆ భాష తప్పనిసరిగా ఉపయోగించాలి.కానీ హిందీ అలాకాదు అలాగే హిందీతోపాటు ఆంగ్లంని కూడా పదిహేను సంవత్సరాలు సహాయ అధికార భాషగా కొనసాగించేవిదంగా రాజ్యాంగంలో పొందుపరచారు.

 ప్రతీ రాష్ట్రంలో కూడా ఏది అధికార భాషగా ఉండాలో ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికే వదిలేశారు.

సుప్రీంకోర్టు, హైకోర్టు లలో భాష ఆంగ్లం గా నిర్ణయం చేశారు. ఏదైనా హైకోర్టులో అక్కడి స్థానిక భాషవాడుకోవాలంటే వాడుకోవచ్చు.స్థానిక కోర్ట్ లలో స్థానిక భాషలలోనే కోర్ట్ వాదోపవాదాలు జరుపుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఏదైనా హిందీయేతర రాష్ట్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు తప్పనిసరి గా ఆంగ్ల భాషను వాడాలి.

హిందీ అతివాదులు వాళ్ళ అత్యుత్సాహం తో హిందీని రుద్దే ప్రయత్నంలో జనసామాన్యంలో ఉన్న భాషకు బదులుగా sanskrized hindi ని రుద్ది హిందీ భాషను మరింత దూరం చేశారు.

అధికార భాష చట్టం,1963 బిల్లుపై  పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు ఎనిమిదవ షెడ్యుల్లో ఉన్న అన్ని భాషలు జాతీయ భాషలేనని ఏ ఒక్కటీ మరొకదానికంటే ఎక్కువ కాదని.హిందీయేతర రాష్ర్టాలు ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలు ఒప్పుకునేదాకా హిందీతో పాటు ఆంగ్ల భాష కూడా కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా ఉంటుందని సభాముఖంగా హామీనిచ్చారు. 

నెహ్రూ చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం లో మళ్ళీ కొంతమంది ఆంగ్లం తీసివేసి హిందీ ఒక్కటే కేంద్ర అధికార భాషగా ఉండాలని ఒత్తిడి తేవడంతో దక్షిణాదిన ముఖ్యంగా తమిళ నాడులో హింది వ్యతిరేక ఉధ్యమం తారాస్థాయికి చేరింది. కొంతమంది చనిపోయారు కూడా కాల్పుల్లో. మళ్ళీ ప్రధానమంత్రి హిందీయేతర రాష్ట్రాలు ఒప్పుకునేదాకా ఆంగ్లం కొనసాగుతుందని హామి ఇవ్వడంతో ఉధ్యమం సద్దుమణిగింది.

చివరకు 1967లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 1963అధికార భాషా చట్టానికి మార్పులు చేసి ఆంగ్లం హిందీతోపాటు నిరవధికంగా కేంద్ర అధికార భాషగా ఉంటుందని చట్టం చేయడంతో ఈ వివాదం ఇక ముగిసిందనే అనుకున్నారు.

కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హిందీ మీద దృష్టి బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల దగ్గర నుంచి అధికార కార్యక్రమాలలో హిందీ వాడకం పెరిగింది.హిందీ భాషకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఇతర భాషలను నిర్లక్ష్యం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మూడాకులు చదివితే బీజేపీ ఇంకో ఆకు ఎక్కువే చదివింది. ఒకసారి రాజ్యాంగంలో భాష గురించి అధికరణలు ఎలా ఉన్నాయో చూద్దాం.


Article 29 of the Constitution of India protects the interests of minorities. The Article states that any section of the citizens who have a “…distinct language, script or culture of its own shall have the right to conserve the same.”

 

Article 343 is about the official language of the Union of India. According to this Article, it is to be Hindi in Devnagri script, and numerals should follow the international form of Indian numerals. This Article also states that English will continue to be used as an official language for 15 years from the commencement of the Constitution.

 

Article 346 is about the official language for communication between the states and between a state and the Union. The Article states that the “authorised” language will be used. However, if two or more states agree that their communications shall be in Hindi, then Hindi may be used.

 

Article 347 gives the President the power to recognise a language as an official language of a given state, provided that the President is satisfied that a substantial proportion of that state desires that the language be recognised. Such recognition can be for a part of the state or the whole state.

 

Article 350B provides for the establishment of a Special Officer for linguistic minorities. The Officer shall be appointed by the President and shall investigate all matters relating to the safeguards for linguistic minorities, reporting directly to the President. The President may then place the reports before each house of the Parliament or send them to the governmentss of the states concerned.

 

The Eighth Schedule of the Constitution of India contains a list of 22 recognised official languages. These are:

1.Assamese 2.Bengali.3 Gujarati 4.Hindi 5.Kannada 6.Kashmiri 

7.Konkani 8.Malayalam 9.Manipuri

10.Marathi 11.Nepali 12.Oriya

13.Punjabi14.Sanskrit 15.Sindhi

16.Tamil 17.Telugu.18.Urdu19.Bodo

20..Santhali 21..Maithili 22. Dogra


జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 114 భాషలను గుర్తించారు.కానీ అందులో 22 భాషలనే రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యుల్లో చేర్చారు. ఇంకా చాలా భాషలను దీంట్లో చేర్చడానికి 38 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి.

పది లక్షల కన్నా ఎక్కువ మంది మాట్లాడే భాషలు ఎనిమిదో షెడ్యుల్ లో 21 ఉన్నాయి. సంస్కృతం ఒక్కటే పదివేలమందే  మాట్లాడినా అధికార భాషగా గుర్తించారు.

భిల్(90 లక్షలు),గొండి(27 లక్షలు),కాందేషి(20లక్షలు),కురుక్ష్(17 లక్షలు),తులు(17 లక్షలు),ముందరి(10లక్షలు) మాట్లాడే వాళ్ళు ఉన్నా ఈ భాషలను ఇంకా గుర్తించలేదు.

పెద్ద చేపలు చిన్న చేపలను మింగినట్లు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ పెద్ద భాషల గొడవలోపడి రెండు వందల భాషలు దాకా కనుమరుగయ్యాయి.ప్రపంచంలోనే 780భాషలతో భారత దేశం అధిక భాషలలో రెండో స్థానంలో ఉంది.


ఇక హిందీ భాషని ఒకసారి పరిశీలిద్దాం

29 రాష్ట్రాలలో 19 రాష్ట్రాలలో హింది అధికార భాష కాదు.దేశంలో దాదాపు  40 శాతం మంది హిందీ మాట్లాడతారు 30 శాతం మంది తమ మాతృభాష గా డిక్లేర్ చేశారు. దాదాపు అరవై శాతం మంది హిందీని అర్థం చేసుకోగలుగుతారు.ఈ లెక్కలు జాతీయ భాషగా గానీ అన్ని రాష్ర్టాలలో అధికార భాషగా చేయడానికి సరిపోతాయా ?

 కొంతమంది చైనా కి మాండరీన్, జపాన్ కి జపనీస్ ఉన్నప్పుడు మనకీ మన దేశీయ భాష జాతీయ భాషగా ఉంటే తప్పేంటి అని వితండవాదం చేస్తుంటారు కానీ ఆదేశాల్లో ఆ భాషలు తొంబై శాతం పైగా మాట్లాడతారు హిందీ అలా కాదేమరి.కనీసం మెజార్టీ ప్రజలకు  కూడా మాతృభాష గా హిందీ లేదు.

హిందీ ఏమన్నా సాహిత్య పరంగా, శాస్త్ర సాంకేతిక పదజాలంలో ఆంగ్లం కన్నా అనువైనదా అంటే కాదు. ఈ విషయంలో తమిళ్,తెలుగు, కన్నడ,బెంగాల్ భాషలు చాలా ముందున్నాయి.మరి ఏవిధంగా హిందీని దేశం మొత్తానికి అధికార భాషగాగానీ,జాతీయ భాషగా గానీ కనీసం లింక్ భాషగాగానీ చేయాలి? 

హిందీ మన జాతీయతను నిర్ణయం చేస్తుందా ? కాదే మిగిలిన అన్ని భాషలలో కెల్లా అధికంగా మాట్లాడే భాష అన్న విషయం తప్ప హిందీని ప్రత్యేకంగా చూడడానికి ఏమర్హతలు లేవు.

ఇక ఉపాధి దగ్గర నుంచి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ సాహిత్యం,ఏరంగంలోనైనా విజ్ఞానానికి ఆంగ్ల భాష దిక్సూచి లాంటిది. ఆంగ్ల పరిజ్ఞానం పైకెదగడానికి మెట్టు.


త్రిభాషా విధానం: దేశ సమైక్యతకు,భాషా సామరస్యత కోసం ఉద్దేశించిన ఈ మూడు భాషల విధానానికి హిందీ రాష్ట్రాలు అతివాద నాయకులు  ఆదిలోనే హంసపాదు వేశారు.

ఈ విధానం  ప్రకారం హిందీయేతర రాష్ట్రాలలోని పాఠశాలలో మాతృభాష,హిందీ,ఆంగ్లం విధ్యార్థులు నేర్చుకునేవిధంగా మరియు హిందీ రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం, ఏదైనా ఇతర భారతీయ భాష వీలైతే దక్షిణ భారత భాషను నేర్చుకునే విధంగా విద్యా విధానం ఉండాలని తీర్మానం చేశారు.

కానీ ఏ హిందీ రాష్ట్రం కూడా వేరే భారతీయ భాషను ప్రవేశ పెట్టలేదు.తమిళ నాడు తప్ప అన్ని రాష్ట్రాలు ఈ త్రిభాషా విధానాన్ని గౌరవించి అమలు చేశాయి.

ప్రతిసారి హిందీ హిందీ అని గోలచేసి హిందీవాదులు త్రిభాషా విధానానికి తూట్లు పొడిచింది వారేనని తెలుసుకోవడం మంచిది.

ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ సర్వీసులు పరీక్షలు,రైల్వే, బ్యాంకులలో హిందీయేతర భాషలవారికి అన్యాయం జరుగుతుంది.

మొన్నటికి మొన్న ఐక్యరాజ్య సమితి లో హిందీని అధికార భాషగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా సిద్దపడింది.అదే క్లాసికల్ భాషగా గుర్తించిన తెలుగు, తమిళ, ఓరియా,మళయాళం, కన్నడ భాషల అభివృద్ధి కి నిధులు విడుదల చేయడానికి మీనమేషాలు లెక్కపెడుతోంది.

పట్టుమని పదివేలమంది జనాభా కూడా మాట్లాడని సంస్కృతానికి కోట్లు గుమ్మరిస్తున్నారు.ఏం ఉపయోగం మృత భాష పై అంత ఖర్చు పెట్టడం.దానికన్నా కోటిమంది దాకా భిల్ గిరిజన భాష అభివృద్ధి కి పెడితే ఎంతో ఉపయోగం కదా.ఎందుకు ఈ హిందీ, సంస్కృతాల మీద అంత వల్లమాలిన ప్రేమ.

ఇంకో దారుణమైన అన్యాయం ఏమిటంటే హిందీ భాష అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు మిగతా 21 భాషలకు పెట్టేదాని కన్నా అక్షరాల 20 రెట్లు ఎక్కువ.కేంద్రానికి పన్నులు హిందీ రాష్ట్రాలే కడుతున్నాయా? ఇక్కడ హిందీయేతర భాషలు దారుణంగా అన్యాయానికి గురవుతున్నాయి.


హిందీయేతర విధ్యార్థి ఎందుకు అదనంగా హిందీ భాషను నేర్చుకోవాలి? ఆ భాషకు పెట్టే ఖర్చు మాతృభాష కు పెట్టుకుంటే పోయేది కదా.

అసలు పదోతరగతి దాకా ఆంగ్లం, మాతృభాష నేర్చుకొని తర్వాత అవసరమైతే,ఇష్టమైతే  ఏ భాషైనా నేర్చుకునే అవకాశం కల్పిస్తే పోతుంది కదా.హిందీ కావాలంటే నేర్చుకుంటారు లేకపోతే వదిలేస్తారు.

దక్షిణ భారత హిందీ ప్రచార సమితి, కేంద్రంలో హిందీ అభివృద్ధి కి ప్రత్యేక విభాగం నెలకొల్పి జాతీయ భాషలెక్కన ప్రొమోట్ చేస్తున్నారు. హిందీ ని అభివృద్ధి చేయండి కానీ మిగతా భాషలను నిర్లక్ష్యం చేసికాదు.

ఒక పక్కన కనపడుతుంది కదా బెంగాలీ భాష కోసం మతాన్ని లెక్క చేయకుండా బంగ్లాదేశ్ ఏర్పడింది.


మనదేశంలో పూర్తిగా నిర్లక్ష్యంకాబడుతున్నవి గిరిజనుల భాషలు.జనాభా లెక్కల ప్రకారం గుర్తించిన 114 భాషలలో 88 గిరిజనుల భాషలే.ఒక్కసారి మనం మాట్లాడే భాష కనుమరుగైతే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. భాష సంస్కృతి కి జీవనాడి వంటిది.

ఎవరి భాష వారు పరిరక్షించుకోవడం వారి ప్రాథమిక హక్కు. అందుకు ప్రభుత్వాలు సహకరించడం వారి విధి.

ఇలా ఓట్ల కోసం,భావజాలం కోసం విభిన్న భాషా సంస్కృతికి తూట్లు పోడవడం దేశ సమైక్యతకు,ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కల్గించడమే.

ఒక ఉదాహరణ దేశంలో అత్యున్నత సర్వీసులైన  IAS,IPS లను ఎంపిక చేసే సివిల్స్ పరీక్షలలో ప్రశ్నా పత్రం హిందీలోగానీ ఆంగ్లం లోగానీ ఉంటుంది వేరే ఏ భాషలో ఉండదు.కాకపోతే సమాధానాలు ఏ భాషలో ఐనా రాసుకోవచ్చు.ఇది వివక్షకు ఉదాహరణ. ఇంకా నయం 1980లదాకా సమాధానాలు కూడా హిందీ ఆంగ్ల భాషలలోనే రాయాల్సి వచ్చేది.తర్వాత మాతృభాష లో రాసుకునే అవకాశం కల్పించారు.ఇది ఒక ఉదాహరణ మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చాలా విషయాలలో హిందీయేతర భాషలు నిర్లక్ష్యం. గురిచేయబడుతున్నాయి.


కడుపు కూటికి ఆంగ్లం తప్పనిసరి, సంస్కృతి పరిరక్షణకు మాతృభాష అభివృద్ధి తప్పనిసరి.ఇది గుర్తెరిగి కేంద్ర ప్రభుత్వం  హిందీయేతర భాషలమీద తన వైఖరి మార్చుకోవాలి.ఆంగ్లం విదేశీ భాషనే కాలం చెల్లిన మాటని పట్టుకుని హిందీని దేశం మీద రుద్దడం ఆపాలి.

ఇష్టం, అవసరాలు ఏ భాషనైనా నేర్చుకునేట్లు చేస్తాయి.అందుకు తగిన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మోదీ రాజకీయ జీవితంపై నా అభిప్రాయం

అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి?