హిందూ సమాజం-జీవన విధానం-ఇస్లాం-మన చరిత్ర-రాజ్యాంగం-హిందూ-ఇస్లామిక్ రాజ్యాలు.
హిందూ సమాజం-జీవన విధానం-ఇస్లాం-మన చరిత్ర-రాజ్యాంగం-హిందూ-ఇస్లామిక్ రాజ్యాలు.
ఎవడి కులం గోల వాడు చూసుకుంటూ,అనైక్యత తో,కుల వివక్ష, అంటరానితనం పాటించడం, నిచ్చెన మెట్ల వ్యవస్థ లో బావిలో కప్పలా ఉండటం
సహనం, లౌకికత్వం కాదు అది బలహీనత,అనైతికత.
మన దేశం విదేశీ దాడులు ఎక్కువ ఎదుర్కోవడంలో వైఫల్యం ఇక్కడ రాజ్యాలలో అనైక్యత.. ఒక సమాజం,ఒక దేశం అనే భావన లేకపోవడం..
సమాజంలో కొన్ని కులాలకే చదువు పరిమితి చేయడం వలన knowledge diffusion జరగలేదు..దీనివలన ఆవిష్కరణలు జరగలేదు..
వృత్తులు పుట్టుకతో నిర్ణయం చేయడం వలన ఆధునికత సాంకేతికత లో వెనకబడ్డాం
సామాజిక సంస్కరణకు ప్రయత్నించిన వాళ్ళని ఆధిపత్య కులాల వారు ఎప్పటికప్పుడు అదుపులో పెట్టారు..
భగవద్గీత, ఉపనిషత్తులు ఎప్పుడు ఎందుకు రాయబడ్డాయో ఒకసారి సామాజిక చరిత్ర చదివితే అర్థం అవుతుంది అవి బుద్దుడు తెచ్చిన సామాజిక విప్లవానికి వ్యతిరేకంగా బ్రాహ్మణిజం ఆధిపత్యం కోసం రాసినవి..
వాటి శ్లోకాలు అర్థాలు కర్మ సిద్దాంతం చదివితే అర్థం అవుతుంది..
మరి హిందూ మతం క్రైస్తవం, ఇస్లాం లాగా ఎందుకు ఇతర దేశాలకు వ్యాప్తి చెందలేదు ? ఎందుకంటే దానికంటూ ఒక ఫిలసాఫికల్ బేస్ లేదు,కులాల రక్షణ కోసం రాసుకున్న పుస్తకాలు అన్ని సమాజాలను ఆకర్షించలేవు,అందుకే మన దగ్గరే ఆగిపోయింది..
గ్రామ దేవతలు, స్థానిక తెగల్లో ఉన్న సాంప్రదాయాలు కాకుండా హిందూ మతానికి చెందిన ఏ గ్రంథమైన తీసుకోండి సరిగ్గా సామాజిక చరిత్ర ప్రకారం అర్థం చేసుకుంటే అవి వర్ణ, కుల ధర్మాల మీద ఆధారపడి ఉంటాయి..
బుద్దిజం ఇక్కడ పుట్టిందే కదా మరి ప్రపంచంలో చాలా దేశాలను ఆకర్షించింది ఎందుకు? చైనా, జపాన్,దక్షిణ కొరియా,థాయిలాండ్,మయన్మార్ ...
జైన మతం వ్యాప్తి చెందకపోవడానికి మరీ ఆ ఆచారాలు పాటించడం కష్టం.. Extreme Sensitivity to violence.
ఇండోనేషియా లో హిందూ మతం వ్యాప్తి చెందినా ఎక్కువ కాలం నిలబడలేదు.. ఇస్లాం వ్యాప్తి చెందింది అదీ ఎక్కువ మెడ మీద కత్తిపెట్టకుండానే ఎందుకు? ఒకసారి ఆలోచించండి..
ఇప్పటికీ హిందూ మెజార్టీ బాలీ ద్వీపంలో(ఇండోనేషియా) కుల వ్యవస్థ, బ్రాహ్మణ వ్రతాలు పాటిస్తుంటారు 😄కాకపోతే స్థానికంగా ఉన్న సాంప్రదాయాలతో కలిసి మన దగ్గర ఉన్నంత సంక్లిష్టత లేదు.. అంటే హిందూ మతం ఎక్కడ ఉన్నా కులాలు తప్పవు అమలాపురం నుండి అమెరికా దాకా..
హిందువులు కులాన్ని పాటించడం అనైతికత, తప్పుగా చూడరు అది వాళ్ళ జీవన విధానంలో భాగంగా చూస్తారు..( దీనికి మన స్వాతంత్ర్య ఉధ్యమ నాయకులు కూడా అతీతం కారు-బ్రిటిషోళ్ళ మీద ఎగేసుకొని వెళ్ళి సొంత ఊళ్ళో దళితుల ఆలయ ప్రవేశాన్ని వ్యతిరేకించిన నాయకులు బొచ్చెడు )
అందుకే ఎక్కడా లేని విధంగా ఈ primitive system ఆధునిక కాలంలో కూడా మనగలిగింది..
దీనికి మనుస్మృతి,ధర్మ శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు...వందల సంవత్సరాలు తరతరాలుగా జీవన విధానం లో భాగమైంది..
రెండు వేల సంవత్సరాలుగా ఒకే కులంలో పెళ్ళిళ్ళ మర్మం అదే. పెళ్లి సంబంధాల వెబ్సైట్లు,పేపర్లలో పెళ్ళిళ్ళ ప్రకటనలు చూస్తూనే ఉన్నాం కదా..సిగ్గు తప్పు చేస్తున్నాం అనే భావన ఉండదు..చదువు డిగ్రీలతో సంబంధం లేదు..
మారుతి రావుకి మద్దతు గా ర్యాలీలు దీనికి పరాకాష్ట నే ఒకదాని కొకటి సంబంధం లేదనుకోమాకండి ..అది తొలి దశ ఇది అంత్య దశ..
ఇక అంటరానితనం ఈ వ్యవస్థ లో నుండి పుట్టుకొచ్చిందే
కర్మ సిద్దాంతం తరతరాలుగా నూరిపోస్తేనే ఇది సాధ్యం..
కోవిడ్ social distancing రూల్స్ ని కూడా ఆచారాల పేరుతో అంటరానితనం పుట్టుకకి లింక్ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు..
It is the longest surviving oppressive system in the world today
అద్దాల మేడలో కూర్చుని సామాజిక స్థాయిలో పైమెట్టులో ఉన్న వాళ్ళకి ఈ హింస,వివక్ష అర్థం కాదు..ఆ స్థానంలో మనం ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటే ఏమన్నా అర్థం అవ్వొచ్చు..
ఆధునిక భారత దేశ చరిత్రలో దీన్ని ఇలా అధ్యయనం చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు.. అందులో అంబేద్కర్ ఒకరు..అందుకే మన సామాజిక చరిత్ర కి ఆయన పుస్తకాలు చదవడం చాలా అవసరం..
అమెరికా లో డాక్టరేట్ చదివిన ఆయనకు ముంబైలో ఇల్లు అద్దెకు ఇవ్వలేదు దళితుడని...ఈనాటికీ అంటరానితనం ఏదోవిధంగా పాటించేవారు కోట్ల మంది..ఉత్తర ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో మెజారిటీ గ్రామాలు ఇలానే తగలబడ్డాయి...
వేరే మతంలోకి ఎందుకు పోతారయ్యా నీ మతంలో గౌరవం ఉంటే,భారత దేశంలో ఇస్లాం వ్యాప్తి మెడ మీద కత్తిపెట్టి మాత్రమే జరిగిందనేది హిందూత్వ వాదుల చెప్పే బూతు చరిత్ర...
కేరళ లో నాలుగోవంతు జనాభా ముస్లింలు.. అక్కడ అరబ్బుల కోస్తా తీరంలో వ్యాపారం ద్వారా వ్యాప్తి చెందింది.. భారత దేశంలో మొదటి చర్చ్,మసీదు అక్కడే ఉన్నాయి..
దేశంలో మతం మారిన మెజార్టీ ముస్లింలు నిమ్నకులాలకు చెందినవారు,కుల గజ్జి నుండి తప్పించుకోవడానికి సూఫీ ఉధ్యమం ద్వారా ఇస్లాం లోకి మారారు..(వెనుకబడిన పాస్మాండా ముస్లింలు 85% ఉంటారు)
అందుకే దేశంలో వేల కొద్ది దర్గాలు..
భక్తి ఉధ్యమం, సూఫీ ఉధ్యమం ఒకదాని కొకటి ప్రభావితమయ్యాయి..
మొఘలుల కాలంలో హిందూ-ముస్లిం సంస్కృతుల సమ్మేళనం చదివితే అర్థమవుతుంది..
బ్రాహ్మణ వాదులు బుద్ధ,జైన గుళ్ళను ఎలా నాశనం చేశారో ముస్లింలు దండయాత్ర లలో కూడా అలానే గుళ్ళను నాశనం చేశారు.. దీనికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి.. నలంద లాంటి విశ్వవిద్యాలయాలు విధ్వంసం లో ముస్లింలు పాత్ర ఉంది..
ఇక క్రైస్తవం సంగతి తెలిసిందే మన దేశంలో బ్రిటిష్ కాలంలో క్రైస్తవ మిషనరీలు చేసిన విద్యావ్యాప్తి మన కళ్ళకు కనపడతానే ఉంది..నిమ్నకులాల వారు ఎక్కువ గా ఆ మతంలో ఎందుకు చేరారో తెలిసిందే..
అలాగని ముస్లింలు, క్రైస్తవులు గొప్ప అని కాదు
ఒక్కో కాలంలో ఒక్కో మతం వారు మిగతా వారికంటే ప్రగతి శీలక మార్పుల్లో ముందు ఉన్నారు అందుకు స్థానిక పరిస్థితులు,నాయకత్వం దోహదం చేశాయి..
మధ్య యుగంలో ఇస్లాం వచ్చేనాటికి బ్రాహ్మణిజ వ్యవస్థ దారుణంగా ఉంది అందుకే ఆ మతానికి ఆకర్షితులయ్యారు..
తర్వాత క్రైస్తవం కూడా అంతే..
ఈ ఆధునిక కాలంలో ముస్లిం మెజార్టీ దేశాలలో ఉన్న సమస్యలకు ఇస్లాం లో సంస్కరణ లేకపోవడం, పశ్చిమ, మధ్య ఆసియా దేశాల్లో భౌగోళిక రాజకీయాలు, పాశ్చాత్య దేశాల వైఖరి,పెట్రోడాలర్ల రాజకీయం లాంటివి కారణాలు..
తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా దేశాలకు పాశ్చాత్య దేశాలకు సాంస్కృతిక పరంగా interaction తక్కువ కానీ
మధ్య, పశ్చిమ ఆసియా దేశాలు,ఉత్తర ఆఫ్రికా దేశాలకు
పాశ్చాత్య దేశాలకు
అంటే ఇస్లామిక్ నాగరికతకు,యూరోపియన్ క్రైస్తవ నాగరికతకు ఇస్లాం పుట్టినప్పటి నుండి Interaction చాలా ఎక్కువ.. యుద్దాల, సంధులు,ఆక్రమణలు, మతమార్పిడులు ...
అందుకే ISIS అనగానే యూరోపియన్ దేశాల నుండి వేల మంది జాయినయ్యారు దక్షిణ ఆసియా,ఆగ్నేయ ఆసియాలనుండి చాలా తక్కువ మంది వెళ్ళారు..
ఏకోశ్వరోపాసన ఉన్న మతాలలో సహజంగానే ఐక్యత భావం ఎక్కువ ఉంటుంది ,పాశ్చాత్య క్రైస్తవ మెజారిటీ దేశాలు దీన్ని దాటి దుందుడుకు జాతీయతా భావనను కూడా దాటి ఆధునిక యుగంలోకి అడుగు పెట్టాయి..
ఇస్లామిక్ దేశాలు ఇంకా మతం దగ్గరే ఆగిపోయాయి..
మన హిందూ మెజార్టీ దేశం విభిన్న సంస్కృతులు సమ్మేళన దేశంగా ఉన్న వెనుకబడిన దేశం,ఆంగ్ల విధ్య నేర్చుకొని హిందూ మతం లో సంస్కరణలకు హిందువుల చాలామంది కృషి చేశారు..
బ్రిటిష్ పాలన ఆర్థికంగా ఎంత విధ్యంసానికి గురి చేసిందో ప్రత్యక్షంగా,పరోక్షంగా సామాజిక చైతన్యానికి అంతే దోహదపడింది..
కావాలని చేసినా వాళ్ళ ప్రయోజనాలకు తోడ్పడుతుందని చేసినా హిందూ దురాచారాలను,భారతీయ సంస్కరణ వాదుల కృషి తో నిషేధించారు..
పాశ్చాత్య ఆధునిక విద్యా వ్యవస్థ నుండి పుట్టిన వాళ్ళే గాంధీ, నెహ్రూ, అంబేద్కర్,రాయ్,పూలే,పెరియార్.......,.............
ప్రజాస్వామ్యం,లౌకికవాదం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆధునిక కాలంలో అక్కడ నుంచి అలవరచుకున్నవే...
మన చరిత్రలో కాస్తో కూస్తో సమానత్వ భావనకు దగ్గరగా వచ్చింది బుద్ధ ఫిలాసఫీ, అప్పుడప్పుడూ కొంతమంది సంస్కరణ వాదులు వచ్చినా బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పటికి
మన దేశం సకల దరిద్రాలతో కుళ్ళిపోయిన వ్యవస్థ..
మన జాతీయ నాయకత్వం చాలా ముందుచూపుతో రాజ్యాంగాన్ని రూపొందించారు.. ప్రపంచ చరిత్రలోనే అది అతి పెద్ద సామాజిక, రాజకీయ, ఆర్థిక విప్లవాత్మకమైన గ్రంథం..
అది పేపర్ మీద మాత్రమే ఉంది
మెజార్టీ జనాలకు సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం,లౌకికవాదం భావనలకు అర్థం తెలియదు ఆచరణలో అసలే పాటించరు..
హిందువులు లౌకిక వాదులు కాబట్టి అలాంటి రాజ్యాంగం రాయలా బ్రిటిష్ విద్యావ్యవస్థ నుంచి నేర్చుకున్న విలువలు సరైన విధంగా ఆచరణ చూపడంలో మన నాయకత్వం నిబద్దత,నిజాయితీ ఆ పనిని చేసిపెట్టింది....అందులో మౌలానా అజాద్ లాంటి ముస్లిం నాయకులు కూడా ఉన్నారు..
అయినా పూలే, అంబేద్కర్, పెరియార్ లు కోరుకున్న సామాజిక విప్లవం మన దగ్గర రాలేదు..
130 కోట్ల జనాభా ఉన్న దేశం,గొప్ప రాజ్యాంగంతోపాటు అభివృద్ధి చెందిన వ్యవస్థ లు కాస్తో కూస్తో ఉండబట్టి,దేశంలో అన్ని ప్రాంతాలు కౌబెల్ట్ రాష్ట్రాలలా లేవు కాబట్టి హిందూ పాకిస్థాన్ అవ్వడానికి అవకాశాలు ఇప్పటికీ తక్కువ గానే ఉన్నాయి..దీనికి హిందువులు లౌకికవాదులవ్వడం కారణం కాదు మన స్వాతంత్ర్య ఉధ్యమ చరిత్ర, సంస్కరణ ఉధ్యమ చరిత్ర,నాయకత్వం కారణం..
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఉత్తర ప్రదేశ్ లని పోల్చి చూడండి ఇరవై కోట్లు, పదహారు కోట్లు, ఇరవై కోట్ల జనాభా
ముస్లిం మెజార్టీ, ముస్లిం మెజార్టీ, హిందూ మెజార్టీ
ఏమన్నా తేడా కనపడుతుందా ? 😄
ఉత్తర ప్రదేశ్ ని ప్రత్యేక దేశం చేసి చూడండి పాకిస్థాన్ కన్నా తీసిపోదు…
ఎక్కడైతే సంస్కరణ ఉందో అక్కడే ప్రగతి
ఏ మతమైనా సంస్కరణ కు గురవకుండా organize అయితే నాశనమే..
ఏకోశ్వరోపాసన ఉన్న ఇస్లాం మతంలో బోర్డర్ దాటి ఐక్యత ఉంటుంది సహజం కానీ అదొక్కటే అన్ని కాలాలలో,ప్రాంతాలలో దిగజారుడు కి కారణం కాదు..
అది బలం బలహీనత రెండు అవుతుంది..
కాశ్మీర్ వేర్పాటువాదంలో ఏ ఇతర ప్రాంతాల భారతీయ ముస్లిం పాల్గొన లేదు.. ఇక్కడ బోర్డర్ తో పని కూడా లేదుమరి..
చరిత్ర, సమాజం,మతం black and white ఉండదు అందులో grey areas చాలా ఉంటాయి..
ఒకప్పుడు క్రైస్తవ మెజార్టీ దేశాల నుంచి యూదులు పారిపోయి ఇస్లామిక్ దేశాల ఆశ్రయం పొందారు..
నిజానికి మధ్య యుగంలో క్రైస్తవం ఇస్లాం కన్నా క్రూరంగా ఎక్కువ మారణహోమాలు చేసింది..
ఆయిల్ బూమ్ తర్వాత ఇస్లామిక్ రాజ్యాల చరిత్ర మారడానికి భౌగోళిక రాజకీయాలు ఎంత కారణమో మతంలో సంస్కరణ లేకపోవడం కూడా అంతే కారణం..
ఇంకో రకం హింస ఆయిల్ వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని ఎగుమతి చేద్దామని అమెరికా నాటో దేశాలు చేసే యుద్ధాలు..లెక్కలు తీస్తే వీటిల్లోనే ఎక్కువ చనిపోయిన వాళ్ళుంటారు..మతం పేరుమీద జరిగిన మారణహోమాల కన్నా..
రెండు మిలియన్ల దాకా చనిపోయిన ఉపఖండ విభజన మారణహోమం నుండి తేరుకుని 1950 లోనే అప్పటి కాలానికి గొప్ప ప్రోగ్రెసివ్ రాజ్యాంగం రాసి ప్రగతికి బలమైన పునాదులు మన జాతీయ నాయకత్వం వేస్తే
రాముడి రథయాత్రలో వందలమంది
ఇరవై శతాబ్దంలో బాబ్రీ మసీదును పట్టపగలు కూల్చిన తర్వాత వందలమంది గొంతులు కోసి దాని రక్తపు పునాదుల మీద అత్యున్నత న్యాయస్థానం రాముడి గుడి కట్టమని బూతు తీర్పు (కామన్ సెన్స్ ఉన్నోళ్ళెవ్వరూ అలాంటి తీర్పు ఇవ్వరు)దానికి మెజారిటీ హిందువులు జబ్బలు చరిచి ( మా కుటుంబంలో కూడా రాముడి గుడి status లు పెట్టారు) హిందువులు లౌకికవాదులు అని సగర్వంగా నిరూపించుకున్నారు..
గుజరాత్, డీల్లీ ఊచకోతలలో వేలమంది ప్రాణాలు తీయడం హిందువుల లౌకికత్వానికి మచ్చుతునకలు
నిందితులకు శిక్షలు పడకపోవడం గుజరాత్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని చేయడం, రాముడి
గుడి,పాకిస్థాన్,హిందూ-ముస్లిం ఖబరిస్తాన్-శంసస్థాన్ రాజకీయాలతో జాతీయ ఎన్నికలు చివరకు రాష్ట్రాల ఎన్నికలు కూడా గెలవడం హిందూ లౌకికత్వానికి గొప్ప కితాబు..
స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి మతకలహాలలో వేలమంది చనిపోయారు..
మనకు ఇచ్చిన వ్యవస్థ ల పునాదులు,రాజ్యాంగం ఎంత ముందు చూపుతో ఉన్నాయి,మనం ఎటు పయనిస్తున్నాం?
మనం డెబ్భై ఏళ్ళల్లో ఇంకా పోల్చుకోవాల్సింది ఇస్లామిక్ రాజ్యాలతోనేనా ?
అయినా ఒక పదన్నా హిందూ మెజారిటీ దేశాలు ఉన్నాయా పోల్చడానికి ఉన్న వి రెండు మొత్తం జనాభా మొత్తం ఇక్కడే ఉంది,హిందువులు ఒక మతం,ఐడెంటిటీ అనే భావన ఏర్పడింది 19 శతాబ్దంలో అది ఒక రాజకీయ మత ఫిలాసఫీగా బలపడింది 20 వ శతాబ్దంలో
చూస్తున్నాంగా దుష్ఫలితాలు.
అంతర్గత బానిసత్వం, ఇతర మతాల మీద ఆధిపత్యం హిందూత్వ పేరుతో బుసలుకొడుతుంది..
రోజుకు సరాసరి పదిమంది దళిత మహిళలు రేపుకి గురౌతున్నారు(రిపోర్ట్ చేయనివి ఎన్నో),వందలమంది దళితులు కుల హత్యలకు గురౌతున్నారు,దేశంలో సగం మంది హిందువులు దాకా ఏదో ఒక విషయంలో అంటరానితనం పాటిస్తున్నారు..
ఐదోవంతు జనాభా ఉన్న దళితుల మీద అనాదిగా జరుగుతున్న హింసకి వాళ్ళు ప్రతిహింస చేయకపోవడం,చేయలేకపోవడం,ప్రజాస్వామ్య మార్గం లో మాత్రమే పోరాటాలు చేయడం ఘనత వహించిన లౌకిక కుల హిందువుల గొప్పతనమా దళిత జాతి గొప్పతనమా ? ఎవడి గొప్పతనం ?
న్యూక్లియర్ ఎనర్జీ రియాక్టర్ పేలడం వలన జరిగే నష్టం ఎక్కువని అందరూ భయపడతారు కానీ బొగ్గు గనుల తవ్వకం అనేది slow poison దాని కాలుష్యానికి చనిపోతుంటారు కాకపోతే మనకు ఒకేసారి బాంబు పేలినట్లు కనపడదు..
అంతే తేడా..
ఇన్ని భాషలు,ఇన్ని ప్రాంతాలు ఇంత వైవిధ్యం ఉండి కూడా హిందూత్వ ఫిలాసఫీ కి హిందువులు పరోక్షంగా, ప్రత్యక్షంగా, నిశ్శబ్దంగా ఉండి మద్దతిస్తున్నారంటే
వ్యవస్థ ల లోపమా దాన్ని పాటించే వ్యక్తుల లోపమా ?
నేను ముస్లిం మెజారిటీ దేశంలో ఉంటే ఇవే ప్రశ్నలు ముస్లింలకి వేసేవాడిని,ముస్లింలు మెజారిటీ ఐతే అనే ఊహత్మక ప్రశ్నలు హిందూ మెజారిటీ దేశంలో ఉండి వేసుకుని చర్చలు చేయను.
మనలాగా సెక్యులర్ రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న ముస్లిం మెజారిటీ దేశాలు గూగుల్ చేస్తే 22 దాకా ఉన్నాయి..
టర్కీ, బంగ్లాదేశ్ (ఆవిర్భావం లో లౌకిక రాజ్యం తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ అని పేరు చేర్చారు కానీ ఏ ఇతర మార్పులు చేయలేదు),సోవియట్ యూనియన్ నుండి విడిపోయిన 5 రిపబ్లిక్ దేశాలు,ఇండోనేషియా,బోస్నియా, కొసావో…..ఇలా ఉన్నాయి..
ఈ దేశాలలో రాజ్యాంగం ఏమాత్రం అమలవుతుందో పూర్తిగా అధ్యయనం చేస్తేగాని అవగాహన రాదు..
1950 లోనే మన దేశ నాయకత్వం ప్రపంచంలో ఆరోవంతు జనాభాకి అందించిన ఆధునిక రాజకీయ, సామాజిక,ఆర్థిక విజన్ డాక్యుమెంట్ మన రాజ్యాంగం. డెబ్బై సంవత్సరాల ప్రజాస్వామ్యం నిరంతరాయంగా ఏ అభివృద్ధి చెందుతున్న దేశం, ఏ ముస్లిం జనాభా కూడా చవిచూడలేదు…..
పేపర్ మీద ఉన్నది ఆచరణలో ఎంతవరకు చూపుతున్నామో జాగ్రత్తగా పరిశీలించండి.
వ్యవస్థలు ఆధిపత్య భావజాలానికి బానిసలు ఎలా అవుతున్నాయో గమనించండి..
హిందూ మతం కూడా సంస్కరణ లేకుండా, వైవిధ్యం పోయి హిందూత్వ తో పూర్తిగా ఐక్యమైతే ఈ దేశం నాశనమే.
హిందూ రాజ్యం ఇస్లామిక్ రాజ్యం కన్నా బెటర్
హిందువులు లౌకికవాదులు కాబట్టి మన దేశం ఇలా మనగలిగింది,ఇండియాలో హిందువులు ముస్లింలు కన్నా బెటర్ అనేవి hypothetical statements మాత్రమే.
Pakistan or the Partition of India పుస్తకంలో
డా.అంబేద్కర్
ఇస్లాం, హిందూ మతాల గురించి ఎనభై ఏళ్ళ క్రింద రాసిన మాటలు
ఇస్లాంని ముస్లింలు పూర్తిగా పాటిస్తే ఇస్లామిక్ రాజ్యం
ఇలా
"There are other defects in Hinduism and in Islam which are responsible for keeping the score between Hindus and Muslims open and running. Hinduism is said to divide people and in contrast, Islam is said to bind people together. This is only a half truth. For Islam divides as inexorably as it binds. Islam is a close corporation and the distinction that it makes between Muslims and non-Muslims is a very real, very positive and very alienating distinction. The brotherhood of Islam is not the universal brotherhood of man. It is the brotherhood of Muslims for Muslims only. There is a fraternity, but its benefit is confined to those within that corporation. For those who are outside the corporation, there is nothing but contempt and enmity. The second defect of Islam is that it is a system of social self-government and is incompatible with local self-government because the allegiance of a Muslim does not rest on his domicile in the country which is his but on the faith to which he belongs"
హిందూ రాజ్యం గురించి
“If Hindu Raj becomes a reality then it would be greatest menace to this country. Whatever may Hindus say, actually it does not make a difference that Hinduism is a danger to Independence, Equality and Brotherhood. Thus it is an enemy of democracy. We should make all out efforts to stop Hindu Raj from becoming a reality.” For Dr. Ambedkar, a Hindu nation meant a nation where the twice-born castes would prevail upon Dalits, OBCs and women. For him, it did not mean just domination over Muslims, as the progressives, Leftists and liberals of India believe"
On caste system and hindu society
~~ Dr.Br.Ambedkar
Caste does not result in economic efficiency. Caste cannot improve, and has not improved, the race. Caste has however done one thing. It has completely disorganized and demoralized the Hindus.
[2:] The first and foremost thing that must be recognized is that Hindu Society is a myth. The name Hindu is itself a foreign name. It was given by the Mohammedans to the natives for the purpose of distinguishing themselves [from them]. It does not occur in any Sanskrit work prior to the Mohammedan invasion. They did not feel the necessity of a common name, because they had no conception of their having constituted a community. Hindu Society as such does not exist. It is only a collection of castes. Each caste is conscious of its existence. Its survival is the be-all and end-all of its existence. Castes do not even form a federation. A caste has no feeling that it is affiliated to other castes, except when there is a Hindu-Muslim riot. On all other occasions each caste endeavours to segregate itself and to distinguish itself from other castes.
[3:] Each caste not only dines among itself and marries among itself, but each caste prescribes its own distinctive dress. What other explanation can there be of the innumerable styles of dress worn by the men and women of India, which so amuse the tourists? Indeed the ideal Hindu must be like a rat living in his own hole, refusing to have any contact with others. There is an utter lack among the Hindus of what the sociologists call "consciousness of kind." There is no Hindu consciousness of kind. In every Hindu the consciousness that exists is the consciousness of his caste. That is the reason why the Hindus cannot be said to form a society or a nation.
[4:] There are, however, many Indians whose patriotism does not permit them to admit that Indians are not a nation, that they are only an amorphous mass of people. They have insisted that underlying the apparent diversity there is a fundamental unity which marks the life of the Hindus, inasmuch as there is a similarity of those habits and customs, beliefs and thoughts, which obtain all over the continent of India. Similarity in habits and customs, beliefs and thoughts, there is. But one cannot accept the conclusion that therefore, the Hindus constitute a society. To do so is to misunderstand the essentials which go to make up a society. Men do not become a society by living in physical proximity, any more than a man ceases to be a member of his society by living so many miles away from other men.
[5:] Secondly, similarity in habits and customs, beliefs and thoughts, is not enough to constitute men into society. Things may be passed physically from one to another like bricks. In the same way habits and customs, beliefs and thoughts of one group may be taken over by another group, and there may thus appear a similarity between the two. Culture spreads by diffusion, and that is why one finds similarity between various primitive tribes in the matter of their habits and customs, beliefs and thoughts, although they do not live in proximity. But no one could say that because there was this similarity, the primitive tribes constituted one society. This is because similarity in certain things is not enough to constitute a society.
[6:] Men constitute a society because they have things which they possess in common. To have similar things is totally different from possessing things in common. And the only way by which men can come to possess things in common with one another is by being in communication with one another. This is merely another way of saying that Society continues to exist by communication—indeed, in communication. To make it concrete, it is not enough if men act in a way which agrees with the acts of others. Parallel activity, even if similar, is not sufficient to bind men into a society.
[7:] This is proved by the fact that the festivals observed by the different castes amongst the Hindus are the same. Yet these parallel performances of similar festivals by the different castes have not bound them into one integral whole. For that purpose what is necessary is for a man to share and participate in a common activity, so that the same emotions are aroused in him that animate the others. Making the individual a sharer or partner in the associated activity, so that he feels its success as his success, its failure as his failure, is the real thing that binds men and makes a society of them. The Caste System prevents common activity; and by preventing common activity, it has prevented the Hindus from becoming a society with a unified life and a consciousness of its own being.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి