హేతువు మరియు నైతికత సంస్కరణ వాది అమ్ముల పొదిలో ఉన్నటువంటి గొప్ప ఆయుధాలు.అవి లేకుండా సంస్కరణ వాదిని ముందుకెళ్ళమంటే సంస్కరణని ఆపడమే .కులం అనేది నైతికత హేతుబద్దతల ప్రకారం ఉందా అని విశ్లేషణ చేయకుండా దాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తారు?

 Reason and morality are the two most powerful weapons in the armoury of a reformer. To deprive him of the use of these weapons is to disable him for action. How are you going to break-up caste, if people are not free to consider whether it accords with reason? How are you going to break-up caste, if people are not free to consider whether it accords with morality?

Dr.Br.Ambedkar.


హేతువు మరియు నైతికత  సంస్కరణ వాది అమ్ముల పొదిలో ఉన్నటువంటి గొప్ప ఆయుధాలు.అవి లేకుండా సంస్కరణ వాదిని ముందుకెళ్ళమంటే సంస్కరణని ఆపడమే .కులం  అనేది నైతికత హేతుబద్దతల ప్రకారం ఉందా అని విశ్లేషణ చేయకుండా దాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తారు?


"The upper caste subordination of the dalit-bahujan people was carried actively  during the anti-colonial struggle. The national leadership, contrary to the official depiction, did not strive to build a casteless, equalitarian ideology. Instead, brahmanical ideologues eulogized the caste culture and structure of ancient India in the name of nationalism. From Rammohun Roy, Dayananda and Vivekananda to Tilak and Savarkar, Gandhi and Nehru, they all defined the nation and nationalism in hegemonic cultural terms. This strengthened the brahmanical forces in order to reestablish their domination in the modern time. Those who criticized brahmanism and the caste system and demanded socio-cultural reconstruction were accused of mounting an attack on Indian custom and tradition. It was argued that the fabric of ’spiritual’ India was being torn apart by low-caste leaders and their illiterate followers.


…..Those who excelled in the art of selling caste to India and the rest of the world were lionized as national heroes. No wonder that varna ideology was found splendid and worthy of export to all cultures of the globe in the nationalist discourse of Vivekananda, Tilak and Gandhi. Even Jawaharlal Nehru was so enamoured of caste that he saw caste a solution to the problem of organising the coexistence of different races. He feared that therefore its abolition ‘may well lead to a complete disruption of social life, resulting in the absence of cohesion, mass suffering and the development on a vast scale of abnormalities in individual behavior….’ (Nehru 1946 [The Discovery of India]: 247) Thus, despite differences in modes of expression, the high caste nationalist trajectory on caste was unambiguously clear - caste had kept us alive as a nation.

~~~Braj Ranjan Mani, 

‘Debrahmanising History’




హిందూ మతగ్రంథాలు,ధర్మ శాస్త్రాలలో మనకిష్టం వచ్చినట్లు  quotes తీసుకుని మంచిని అన్వయించుకొని సంస్కరణ తెస్తానంటే అది ఎవరికి లాభం? ఆ ధర్మ శాస్త్రాల ద్వారా నీకు లాభం ఉంటేనో లేక నీ వర్గానికో/కులానికో అవమానం,బాధ కలగకుంటేనే కదా ఈ cherry picking చేసేది..ఆ privileged position లో ఉంటేనే కదా నీకు వాటిద్వారా బాధపడిన,పడుతున్న వారి చరిత్ర, సమస్యలు అర్థం కానిది.

ముందు వాటిలో ఉన్న చెడును గుర్తించాలి కదా..ఒకవేళ గుర్తించినా  ఇది అన్ని సమాజాలలో ఉండేదే,ఆ కాలానికి తగ్గట్టు వ్యవస్థ ను అలా ఏర్పాటు చేసుకున్నారని మన దేశం ప్రత్యేకం కాదని పరోక్షంగా దాన్ని సమర్థించడం లేదా ఆ వివక్ష, హింసను తక్కువ చేసి చూపడం 

హిందూ  ఆధిపత్య కులాల  నుండి వచ్చిన సంస్కరణ వాదులు, స్వాతంత్ర్య పోరాట నాయకులు చరిత్రలో చేసిన విన్యాసం..

ఇదే భావజాలం ఇప్పటికీ కొనసాగుతోంది.. అందుకే చరిత్రను బాధిత వర్గపు సమాజం నుండి అర్థం చేసుకోవాల్సిన  అవసరం ఉంది..దీనిని ఆ నాయకుల మీద దాడిగానో లేక వాళ్ళ మీద ద్వేషంతోనో చేస్తున్నదిగా చిత్రీకరిస్తూ  దానివలన ప్రయోజనం ఏమిటి అని చాలామంది ఉదారవాద స్నేహితులు కూడా నా పోస్ట్ లలో కామెంట్స్ చేస్తుంటారు..కాదు ఇది చరిత్రను మనం అర్థం చేసుకునే విధానం లో విశాలత్వం పెరగడం..మూలకారణాల శోధనలో పరిణితి చెందడం.

నిజానికి గాంధీ లాంటి నాయకులు ఇలాంటి పరిణామాన్న్ని స్వాగతించేవారే.


కుల వ్యవస్థ మన ఉపఖండ సమాజానికి ప్రత్యేకం..

It is the longest surviving oppressive system in the world today.

మతం మారినా,దేశాలు,ఖండాలు, సముద్రాలు దాటినా  కులం పోవడం లేదు..

ఎందుకు ఇలా ఉంది అని ఎప్పుడైనా ఆలోచించడం చేయాలి కదా? 

ఇవ్వాళ హిందూత్వ భావజాలం పేట్రేగిపోతోంది కాబట్టి RSS,BJP ల మీద విమర్శలు చేస్తే మార్పు వస్తుందనుకుంటున్నారు....

ముస్లింల పాలన,బ్రిటిష్ పాలన వలన కూడా పెద్ద గా ఈ వ్యవస్థ లో మార్పులు రాలేదు..ఎందుకు? 

స్వాతంత్ర్య ఉధ్యమ కాలంలో చాలామంది సంస్కరణ కోసం కృషి చేశారు..

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్థిక అభివృద్ధి ద్వారా  వ్యవస్థలో సమూలమైన మార్పులు వస్తాయనుకున్నాము..వచ్చాయా? 

చదువు కోవడం వలన ఆర్థిక వృద్ధి సాధించడం వలన కుల గజ్జి తగ్గిపోతుందని నిరూపించగలమా? ఆర్థికంగా కాస్తో కూస్తో అభివృద్ధి చెందిన కోస్తా జిల్లాల్లో ఉన్న కుల గజ్జి వేరే జిల్లాల్లో లేదు..

ఎవరు చదువుకుంటే మార్పు వస్తుంది.. ఎలాంటి చదువు చదువుకుంటే మార్పు వస్తుంది..?

మన విద్యా వ్యవస్థ లో సామాజిక శాస్త్రాల అధ్యయనం హేతుబద్దంగా జరుగుతుందా ? ఎవరి భావజాలం ఇంకా జాతీయ వాదానికి, దేశ భక్తి కి ప్రాతినిధ్యం వహిస్తోంది? 


హిందూత్వ భావజాలం జబ్బు యొక్క లక్షణమే అసలైన జబ్బు చరిత్ర అధ్యయనం దగ్గర నుంచి మన రోజువారీ జీవన విధానం,మన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ లలో  ఉన్నటువంటి ద్వంద ప్రవృత్తి..

హత్రాస్ సంఘటన కి యోగి ని మాత్రమే బాధ్యుడిని చేయడం జబ్బు లక్షణాన్ని నిందించడమే కానీ  జబ్బు ను కాదు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఏ పార్టీ ప్రభుత్వమైనా కుల వ్యవస్థ మీద అంతర్జాతీయ సమావేశాలలో (ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి) చర్చ కు ప్రోత్సహించలేదు.అది అంతర్గత సమస్య గా కొట్టిపారేశాయి..జాతివివక్ష మీద చర్చ కు పరుగులు తీసే ప్రభుత్వాలు కులవివక్ష దగ్గర వచ్చేసరికి సాగిలపడతాయి,ఎందుకు? ఎవరి ఆధిపత్యం మీద దెబ్బ పడుతుందని ? 

ఈ ప్రవర్తనకు స్వాతంత్ర్య ఉధ్యమ కాలంలో రాజకీయ స్వాతంత్ర్యమే పరమావధి,మిగతా సంస్కరణలు బ్రిటిష్ వారిని తరిమికొట్టాక చూద్దాం అన్న  భారత జాతీయ కాంగ్రెస్ ప్రవర్తనకు తేడా ఏమిటి? 

స్వాతంత్య్రం వచ్చాక కూడా సామాజిక, సాంస్కృతిక విప్లవ బాధ్యత మనమీద పడ్డాక కూడా రాజకీయ అధికారం మాత్రమే పరమావధిగా వ్యవహరించిన వ్యవస్థలు ఎవరి ప్రయోజనాల కోసం ఏ భావజాలంతో నడుస్తున్నాయి? 

రామ మందిరం కోసం ఊగిపోయిన జనాలు, పరోక్ష ప్రత్యక్ష మద్దతు తెలిపిన నాయకులు ఏనాడైనా అంటరానితనానికి,కుల వ్యవస్థ కు వ్యతిరేకంగా ఉధ్యమం చేశారా? 


ఇవ్వాళ RSS ఇతర రైట్ వింగ్ సంస్థల మీదనే తప్పు మొత్తం నెట్టేయడం కాదు.డెబ్బై మూడు సంవత్సరాల స్వతంత్ర భారతం సామాజిక,సాంస్కృతిక విప్లవం వైపు అడుగేయకపోవడంలో ఎందుకు విఫలమైంది? మార్పు ఎక్కడ నుంచి రావాలి? అసలు మార్పుకు మొదట బాధ్యత వహించి  ముందుకు రావాల్సిన ఆధిపత్య కులాలు అడుగడుగునా సంస్కరణకు అడ్డుతగలడానికి కారణమేంటి? 

ఇలాంటి మార్పుకు చరిత్రలో బుద్ధుడి దగ్గర నుంచి అంబేడ్కర్ దాకా నడచిన బాటలో అడ్డంకులు ఎందుకొచ్చాయి? 

పంతొమ్మిదో శతాబ్దంలోనే  సమానత్వంతో కూడిన సామాజిక విప్లవానికి నాందిపలికిన పూలేకి భారత సంస్కృతి ,బ్రిటీష్ వాళ్ళను బూచిగా చూపి అడ్డునిలిచిన  ఆధిపత్య భావజాలమే ఇప్పటికీ చట్టాలు మారినా,స్వాతంత్య్రం వచ్చినా దేశభక్తి,జాతీయత పేరుతో సంస్కృతిక దురహంకారంతో పరోక్షంగా, ప్రత్యక్షంగా అడ్డుతగులుతుంది..

హిందూ ఉదారవాదుల భాష సున్నితంగా ఉండవచ్చు కానీ భావం  చరిత్రలో జరిగిన హింసను,వివక్షను తక్కువ చేసి చూపుతూ లేదా అనుకూలంగా చరిత్ర ను అన్వయించుకుంటూ ఇప్పుడు జరుగుతున్న దానికి indifferent Attitude చూపడమే..

ఇది మారనంతవరకూ హింసాత్మకమైన జబ్బు నయం కాదు.. ఉపశమనం మాత్రమే కలుగుతుంది.


చరిత్రలో 

అన్యాయానికి, హింసకు, వివక్షకు ముసుగేసి కప్పిపుచ్చడం,అనుకూల అన్వయంతో మార్పుకోసం ప్రయత్నం చేయడం,మంచినే ప్రామాణికంగా తీసుకుని చెడుని మరచిపోండని తేనె పూయడం  వలన కుల వ్యవస్థలో శాశ్వత మార్పులు రాకపోగా బాధిత సమాజానికి నిజాయితీని చూప‌లేని మూఢత్వం అయ్యింది..

బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రత్యామ్నాయ దృక్పథం కోసం,ప్రజలను ప్రేరేపించడం కోసం  స్వాతంత్ర్య ఉధ్యమ నాయకులు  ఊహాత్మక  ప్రాచీన స్వర్ణ యుగ హిందూ భారతం,రామరాజ్యం,గోరక్షణ,శివాజీ ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు లాంటి  మత  చిహ్నాలను వాడారు..ఇవన్నీ తర్వాత కాలంలో దేశ సాంస్కృతిక దురహంకారానికి,మైనారిటీల మీద దాడులకి  ప్రతీకలయ్యాయి..

ఇలానే జాతీయోద్యమం,ఐక్యత, అంతర్గత వ్యవహారాలలో బ్రిటిష్ జోక్యం, హిందూ మత ఐక్యత పేరుతో సామాజిక, సాంస్కృతిక విప్లవానికి విముఖత చూపారు.

ఆ విప్లవానికి కృషి చేసిన పూలే, అంబేద్కర్, పెరియార్ లాంటి వారికి  బ్రిటిష్ ఏజెంట్లు, జాతి విరోధులు, అంతర్గత శత్రువులు లాంటి బిరుదులిచ్చారు..

చరిత్ర పుస్తకాలలో నిర్లక్ష్యం చేశారు..

ఆ విముఖత,నిర్లక్ష్యంకి ఇప్పటికీ కొనసాగుతోంది..

వివక్ష, హింస, దోపిడీ చూపేది నల్లవాడైతేనేమి తెల్లావాడైతేమి చెడు మంచవ్వదు కదా…

చరిత్ర నుంచి సరైన పాఠాలు నేర్వక,నేర్పించక స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రాలకి నిజమైన అర్థం జనాల్లోకి తీసుకెళ్ళడంలో వ్యవస్థ లు వైఫల్యం చెందాయి..ఫలితం మెజార్టీ భారతీయులు అనుభవిస్తున్నారు..


హేతువు,నిజాయితీ, నైతికత తో చరిత్రని అర్థం చేసుకుని వర్తమానాన్ని నడిపిస్తే భవిష్యత్ బంగారు బాటవుతుంది.








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మోదీ రాజకీయ జీవితంపై నా అభిప్రాయం

అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి?