మానవవాదం ఆలోచన దృక్పథం
Humanism is a philosophical and ethical stance that emphasizes the value and agency of human beings, individually and collectively, and prefers critical thinking and evidence (rationalism and empiricism) over acceptance of dogma or superstition.
మానవ వాదం మనిషిని మనిషిగా గుర్తించి నిలబెట్టే వాదం.
మానవ వాదం మానిషి హూందాతనానికి విలువనిస్తూ దానిని ఉల్లంఘించే కుల,మత,జాతి,ప్రాంత, వర్గ,లింగ వివక్షలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన బాణం.
మానవ వాదం మానవ హక్కులు ప్రాతిపదికగా ఆ హక్కులు ఉల్లంఘన ఎక్కడ ఎవరిపై జరిగినా గళం వినిపించే నాదం.
సామాజిక స్పృహతో సమతను కాంక్షిస్తూనే వ్యక్తి స్వాతంత్ర్యానికీ,స్వేచ్ఛకు ఆ కాంక్ష సంకెలవకుండా సంతులనాన్ని పాటించే విధానం ఈ వాదం.
మానవవాదం ఏ సంస్కృతి సాంప్రదాయాలైన హేతుబద్దత పరీక్ష కు నిలబడాలని నినదించే వాదం.నిన్న సరనిపించింది ఇవ్వాళ సరికాదని నిరూపణైనప్పుడు దానికి తగ్గట్లు మన దారిని మార్చుకోవమనే సిద్దాంతం.ఇందులో పిడివాదానికి తావులేదు.
మానవ సంక్షేమానికి నైతికతతో జీవించడానికి ఏ మతమూ అక్కర్లేదనీ, సహేతుకమైన ఆలోచనతో మనిషి కేంద్రంగా మానవ హక్కులను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళమని దారిచూపే విధానం.ఈ ప్రయాణం లో సైన్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మానవ సంక్షేమానికి ఆ అభివృద్ధి తోడ్పడేలా చేయడం మానవవాద లక్ష్యం.
మానవవాదం ఇప్పుడు పుట్టింది కాదు.మనిషి కేంద్రం గా మన జీవనం ఉండాలని ప్రాచీన కాలం నుంచి వర్తమానం దాకా ఎందరో మహానుభావులు దారి చూపారు. ఆ దారిని ఎప్పటికప్పుడు హేతుబద్దతతో మార్పులు చేసుకుంటూ ముందుకెళుతున్నాము.
మన దేశంలో చార్వాకులు,బుద్ధుడు లాంటి వారు దీనికి పునాదులు వేశారు.
ఆధునిక యుగంలో యూరోపియన్ సాంస్కృతిక పునరజ్జీవనం,బ్రిటిష్ మాగ్నా కార్టా, అక్కడ ప్రజాస్వామ్యం కోసం హక్కుల కోసం రాచరికం మీద జరిగిన పోరాటం,ఫ్రెంచ్ విప్లవం,అమెరికన్ విప్లవం,వివిధ దేశాలలో స్వాతంత్య్రం కోసం,కుల మత, జాతి వివక్ష కు వ్యతిరేకంగా జరిగిన ఉధ్యమాలు మనిషి కేంద్రం గా ఆలోచించడంతో వచ్చినవే.
మన దేశ స్వాతంత్ర్య ఉధ్యమం, సామాజిక మత సంస్కరణ ఉధ్యమాలు ఇందులో భాగమే.
రెండు ప్రపంచ యుద్ధాలు ఫాసిజం,అతి జాతీయవాదం, నాజీయిజమ్,సామ్రాజ్య వాదం లాంటి పిడివాదాల నుంచి వచ్చినవే.కోట్ల మంది అశువులు బాసిన మారణహోమం నుంచి తేరుకొని
ఐక్యరాజ్య సమితి ద్వారా సార్వజనీన మానవ హక్కుల ఘోషణా పత్రాన్ని ముందుకు తెచ్చారు.ఈ డాక్యుమెంట్ మనిషి కేంద్రం గా మానవవాద స్పూర్తితో వచ్చినదే.
ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని తీసుకున్నా అది మానవ కేంద్రంగా మానవ హక్కులు,మానవ సంక్షేమం అభివృద్ధి ప్రాతిపదికగా రాసుకున్నవే.
అందుకు భారత్, అమెరికా, బ్రిటన్,ఫ్రాన్సు, జపాన్ లాంటి ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలు గొప్ప ఉదాహరణలు.
మరి మానవ హక్కులను పరిరక్షించడంలో మనం ఎంతవరకు సఫలమయ్యాము ?
ఇటీవలి ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో జరుగుతున్న ఘర్షణల వలన దాదాపు ఏడు కోట్లమంది నిరాశ్రయులయ్యారు. చరిత్ర లోనే ఇది అత్యధికం.
ఈ ఘర్షణలు ప్రధానంగా మతం,ప్రాంతీయ మరియు ఆర్థిక రాజకీయాలు,జాతి పేరుతో జరుగుతున్నాయి.
ఈ సంకుచిత భావాలనుంచి మనిషి,అతను ఏర్పరచిన వ్యవస్థలు ఎదగపోవడం వలనే ఈ ఘర్షణలు జరుగుతున్నాయి.ఉదాహరణకు ఒక్క సిరియా ఘర్షణ లోనే పది మిలియన్లు నిరాశ్రయులైతే ఆరు లక్షల మంది దాకి ప్రాణాలు కోల్పోయారు.దీనికి ప్రధాన కారణం మత చాంధసవాదం దానికి తోడు ప్రాంతీయ ఆర్థిక రాజకీయాలు తోడయ్యి సమస్యను జటిలం చేశాయి.
మన దేశంలో కులం,మతం రాజకీయాల దగ్గర నుంచి మనిషి ఏమి తినాలి అనేది కూడా శాసించే స్థితిలో ఉన్నాయి.ప్రపంచీకరణతో ఆధునికతను అంది పొచ్చుకున్నా అదే ఆధునిక సాధనాలతో జ్యోతిష్యం,న్యూమరాలజీ, యజ్ఞాలు లాంటి రాతియుగపు తిరోగమనపు మూఢత్వ ఆలోచనలను ప్రచారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారంటే దేశంలో హేతువాద దృక్పథ అవసరం ఎంత ఉందో తెలుస్తుంది.
సైన్సు కాన్ఫరెన్స్లలో ప్రాచీన విమానాలు గురించి చర్చలు,రాజకీయ నాయకులు సైన్సు ని అవమానిస్తూ సూడో సైన్స్ ని సమర్థిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు, ప్రజలలో మూఢత్వాన్ని పెంచుతున్న మత గురువులకు అధికార వర్గాల ప్రాధాన్యత,రాజకీయాలలో మతం పేరుతో ప్రజలను మభ్య పెట్టడం లాంటివి దేశంలో మనిషి కేంద్రం గా మనిషి పురోభివృద్ధి కి కట్టుబడిన మానవవాద భావజాలం ప్రజలలోకి తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి.
మెజార్టీ మతమైన హిందూ మతం సంఘటితమై ఏకరూపత సంస్క్రతి ని హిందూత్వ పేరుతో సమాజంలో రుద్దడం వలన దళితులు, మైనార్టీ ప్రజలమీద ఆవు పరిరక్షణ పేరుతో దాడులు పెరిగాయి.
సాంస్కృతిక దురహంకారంతో అసత్యపు చరిత్రను సృష్టించి ప్రాచీన స్వర్ణ యుగం పేరుతో ఇతర మతాలను వేరుగా చూడడం,వివక్షకు గురిచేయడం దేశంలో పౌరులను భారతీయులుగా కాకుండా హిందువుగానూ,ముస్లింగాను,క్రైస్థవుడిగానూ చూస్తూ తమ రాజకీయం పబ్బం గడుపుకుంటున్నారు.
మహిళల స్వాతంత్య్రం,స్వేచ్ఛ పై ఈ సాంప్రదాయ వాదులే ఆంక్షలు విధిస్తున్నారు.మతచాంధసవాదం అన్ని మతాలలోని స్త్రీల హక్కులను హరిస్తుంది.
ఇప్పటికీ ముప్పై శాతం హిందువులు అంటరానితనం పాటిస్తున్నారంటే మనిషి హూందాతనానికి రాజ్యాంగ విలువలకు సమాజంలో గౌరవం ఏపాటిదో తెలుస్తుంది.దళితుడు గుర్రమెక్కితే సమస్య గుడిలోకీ అడుగు పెడితే,కాలేజీలో రిజర్వేషన్లు పొందేవారి మీద వివక్ష ,నల్లగా ఉంటే వివక్ష, ఈశాన్య భారతీయులైతే చింకీలని వివక్ష ఇలా దేశంలో వివిధ రకాలుగా మనిషిని మనిషి గా చూడకుండా మానవ హక్కుల హననానికి పాల్పడుతున్నారు.
వీటన్నింటికీ పరిష్కారం మానవవాద హేతువాద దృక్పథంలో ఉంది.ఆ భావజాలం ప్రాతిపదికన రాసుకున్న రాజ్యాంగ విలువల పరిరక్షణ లో ఉంది.
కుల,మత,జాతి,ప్రాంత, లింగ సంకుచిత భావాలను వదలి మనం విశ్వజనీనమైన మానవాద భావజాలంతో విశ్వమానవులుగా ఎదగడంలో మానవ పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది.
మానవవాద దినోత్సవ శుభాకాంక్షలు ❤️💓❤️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి