అమెరికా అధ్యక్షుడు ఎన్నిక ఎలా జరుగుతుంది?
అమెరికా ప్రెసిడెంట్ ని ఎన్నుకునేది ఎలక్ట్రోరల్ కాలేజీ
అందులో మెంబర్ల సంఖ్య 538.
ఈ నంబర్ ఎలా నిర్ణయం చేశారంటే
మన పార్లమెంట్ లానే అక్కడ కూడా లెజిస్లేటర్ లో(కాంగ్రెస్ అంటారు) రెండు సభలు ఉంటాయి
ఎగువ సభ(సెనేట్)
దిగువ సభ (ప్రతినిధుల సభ -House of Representatives )
ఇక్కడ సెనేట్ లో 100 మంది అంటే ప్రతీ రాష్ట్రానికి ఇద్దరు సెనెటర్లు ఉంటారు జనాభా తో సంబంధం లేకుండా..
ప్రతినిధులు సభలో 438 మంది సభ్యులు ఉంటారు.ఇది దాదాపు జనాభా ప్రాతిపదికన నిర్ణయం చేస్తారు..
ఎలక్ట్రోరల్ కాలేజ్ మెంబర్ల సంఖ్య 100+438=538 ఇలా వచ్చిందనమాట..
ప్రతీ రాష్ట్రానికి సెనేట్ (2) మరియు ప్రతినిధుల సభలో ఎంతమంది ఉంటే అంతమంది కలిపి ఆ రాష్ట్రంలో ఎలక్ట్రోరల్ కాలేజీ సంఖ్య ను నిర్ణయం చేస్తారు..
ఉదాహరణకు కాలిఫోర్నియా రాష్ట్రంలో 53 మంది ప్రతినిధుల సభ మెంబర్లు సెనేట్ ఇద్దరితో కలిపి 55 అవుతుంది..
ప్రతీరాష్ట్రంలో ఈ ఎలక్ట్రోరల్ కాలేజ్ మెంబర్లను పార్టీ తరుపున నామినేట్ చేస్తారు..
ఓటింగ్ వీరిని ఎన్నుకోవడానికి జరుగుతుంది..
ఎలాగంటే ఆ రాష్ట్రంలో మెజార్టీ ఓట్లు ఏపార్టీకి వస్తే మొత్తం సీట్లు ఆ పార్టీ కే వెళతాయి..
ఒక రెండు మూడు రాష్ట్రాలు తప్పక అన్ని రాష్ట్రాలలోనూ మెజారిటీ ఓట్లు ఎవరికైతే ఆ రాష్ట్రంలో వస్తాయో ఆ పార్టీకి చెందిన ఈ ఎలక్ట్రోరల్ కాలేజీ మెంబర్లందరూ గెలుస్తారు..
ఈ ఎలక్ట్రోరల్ కాలేజ్ మెంబర్లు ఎన్నికల తర్వాత ఒకరోజు ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఎవరూ అని నిర్ణయం చేస్తారు..
మెజార్టీ ఎవరికి ఓటు వేస్తే వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారు..
పార్టీ నియమించిన వాళ్ళు కాబట్టి వేరే పార్టీ అభ్యర్థి కి ఓటు వేయడం అరుదు.....
ఈ విధానంలో ప్రధాన లోపమేంటంటే
ఉదాహరణకు కాలిఫోర్నియా డెమాక్రటిక్ పార్టీ ఆధిపత్యం ఉంటుంది.. అక్కడ రిపబ్లికన్ పార్టీ కి వేసిన ఓట్ల వలన లాభం ఉండదు ఎందుకంటే మెజారిటీ డెమాక్రటిక్ పార్టీ కి వేస్తారు కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్న ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లన్ని ఆ పార్టీ కే వెళ్తాయి..
ఇలా ఓకే పార్టీ కి ఆధిపత్యం లో ఉన్న రాష్ట్రాలు ఒక నలభై దాకా ఉన్నాయి.. ఏదో ఒక్క పార్టీ కే మెజారిటీ ఓట్లు ఖచ్చితంగా వేస్తారు కాబట్టి ఈ రాష్ట్రాల మీద ఎక్కువ ఫోకస్ ఉండదు అలాగే ఆ రాష్ట్రంలో ఆధిపత్య పార్టీ కి కాకుండా వేరే పార్టీకి ఓట్లు వేసిన వారికి ప్రెసిడెంట్ ఎన్నికలో భాగస్వామ్యం లేనట్లే..
దేశ వ్యాప్తంగా పాపులర్ ఓటు వచ్చినా అందుకే కొన్ని సార్లు ప్రెసిడెంట్ అభ్యర్థులు ఈ ఎలక్ట్రోరల్ కాలేజీ పద్ధతి వలన గెలవరు..
పోటాపోటీగా ఉండే ఆ పది రాష్ట్రాల మీద అందరి ఫోకస్ ఉంటుంది.. అక్కడనే డబ్బుల ఖర్చు, ప్రచారం ఎక్కువ ఉంటుంది..
రిపబ్లికన్లు ఎక్కువ రాష్ట్రాలలో మెజారిటీ ఓట్లు సాధించడం వల్లనే గతంలో బుష్(2000), ట్రంపు(2016) దేశం మొత్తం మీద మెజారిటీ ఓట్లు రాకపోయినా గెలిచారు..
సెనేట్ అయితే మరీ దారుణం ఏడు లక్షల జనాభా ఉన్న అలస్కా రాష్ట్రానికి నాలుగు కోట్ల జనాభాకి కాలిఫోర్నియా రాష్ట్రానికి ఇద్దరే సెనెటర్లు..
దీనివలన అలస్కా ఓటరు కున్న ప్రాధాన్యత కాలిఫోర్నియా కి ఉండటం లేదు..
పోటాపోటీగా ఉన్న రాష్ట్రాల ఓటర్లే ప్రెసిడెంట్ ఎన్నికలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు..
మన దేశంలో ఎగువ సభైన రాజ్య సభలో కూడా దాదాపు జనాభా ప్రకారమే సీట్లు ఉన్నాయి.. అందుబాటులో ఉత్తర ప్రదేశ్,బీహర్లకి సింహభాగం సీట్లతో లోక్ సభ,రాజ్య సభలో నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది..
జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయని భావించి 1971 జనాభా ప్రకారమే సీట్లు కేటాయించడం జరుగుతుంది..
లేకపోతే ఇప్పుడు 80 సీట్లు ఉన్న ఉత్తర ప్రదేశ్ కి ఇప్పటి జనాభా ప్రకారమైతే 100 సీట్లు దాకా కేటాయించాల్సి వస్తుంది..🙂
మైనారిటీ ఓట్లకూ అలాగే జనాభాకి రెండింటికీ సమతుల్యత పాటించాలి..
అమెరికా సెనెట్ లో ఫెడరల్ వ్యవస్థ కాబట్టి ప్రతీ రాష్ట్రానికి జనాభా తో సంబంధం లేకుండా రెండు సీట్లు కేటాయించారు.. దీనివలన జనాభా ఎంత ఎక్కువ ఉన్నా ప్రయోజనం లేకుండా ఉంది..
కాంగ్రెస్
సెనెట్- 100
ప్రతినిధులు సభ-438
538
ఎలక్ట్రోరల్ కాలేజీ 538
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి