బాలగంగాధర్ తిలక్ దృష్టిలో స్వరాజ్యం
ఇవ్వాల బాలగంగాధర్ తిలక్ వర్థంతి(1854-1920).
ఆయనకి లోక మాన్య అని బిరుదు.. గాంధీ ఆయన్ని 'ఆధునిక భారత నిర్మాత' నెహ్రూ 'భారతీయ విప్లవ పిత' అని కొనియాడారు..మరి అంత గొప్ప మహానుభావుడు..ఆ కాలంలో వ్యక్త పరిచిన భావాలు,ఘనకార్యాలు ఒకసారి చూద్దామా..
ఆయనిచ్చిన గొప్ప నినాదం "స్వరాజ్యం నా జన్మ హక్కు"..సూపర్...చాలా బాగుంది కదా మరి ఆ స్వరాజ్యంలో ఎవరికి చదువుకొని సమాన హక్కులు పొందే అవకాశం ఉంది?
మహిళలకు విద్యను వ్యతిరేకించాడు.ముఖ్యంగా ఆంగ్ల విద్య చదివితే భారతీయ సంస్కృతి విలువలు కోల్పోయి నైతికతను కోల్పోతారు. గృహస్థ ధర్మాలను విడచి గర్వం పెరిగి భర్తకు భారంగా మారతారు.అందుకే వాళ్ళకు కుటుంబ వ్యవహారాలు చూసుకునే విదంగా చిన్నపాటి విద్యా బుద్ధి ఉంటే చాలు.మగవాళ్ళు మాత్రమే చదువుకొని రాజకీయ సామాజిక వ్యవహారాలు నడపాలి.చరిత్రలో మగవారే ఈ పాత్ర పోషించారు.స్థానికంగా పూలే లాంటి సంస్కరణ వాదులు బాలికల పాఠశాలలు తెరవడాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు.
సంస్కరణ వాదుల కృషి తో విద్య ఉద్యోగాలలో బ్రాహ్మణ ఆధిపత్యం తగ్గిపోతుండడంతో అందరికీ విధ్య విధానాన్ని వ్యతిరేకించాడు.ఏ కులం వారు ఆ కుల వృత్తి కి సంభంధించిన విద్య చదువుకుంటే చాలు.ఆంగ్ల మాధ్యమంలో చరిత్ర, గణితం, జాగ్రఫీ లాంటి లిబరల్ విధ్య బ్రాహ్మణేతరులకు వ్యతిరేకించాడు. కొని చట్టసభలకొచ్చి తేలీలు నూనె అమ్ముతారా( మోదీ ఈ కులానికి చెందినవాడే.. 😄)
,కతీలు దుక్కిదున్నుతారా,తంబోలీలు బట్టలు కుడతారా అని ఎద్దేవా చేశాడు.మంగ్లి,మహర్ లాంటి కులాల విధ్యార్థులు అగ్ర కులాలతో కూర్చోబెట్టి చదవడం హిందూ కులవ్యవస్థ కు భంగమని వాపోయాడు.చదువు లో హిందూ ధర్మ శాస్త్రాలు ఉండాలన్నాడు.గవర్నమెంట్ చేతిలోనుండి పాఠశాలలు స్థానిక సంస్థలకు,ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని పట్టుబట్టాడు ఎందుకంటే అక్కడ అగ్ర కులాల ఆధిపత్యం (పన్నులు కట్టేవాళ్ళకే ఓట్లు సహజంగా అగ్ర కులాల వారే మొత్తం ఉంటారు)ఉంటుంది కాబట్టి వాళ్ళిష్టమొచ్చినట్లు విద్యావిధానం అమలు జరపవచ్చని.
కులాంతర వివాహాలను వ్యతిరేకించాడు. ఇందులో అగ్ర కుల మహిళలు నిమ్నకులాల మగవారిని చేసుకోవటాన్నైతే పూర్తిగా వ్యతిరేకించాడు..మహానుభావుడు మహరాష్ట్రలో ఉన్నటువంటి మూడు బ్రాహ్మణ శాఖలలో మటుకు శాఖాంతర వివాహాలను ప్రోత్సహించాడు.ఎంత గొప్ప సంస్కర్తనో కదా..😊
బాలికల కనీస వివాహ వయస్సు పెంపు చట్టాన్ని మత వ్యవహారాలలో జోక్యం పేరుతో వ్యతిరేకించాడు.
అపరిమిత ఆంగ్ల విద్య, హిందూ మతంలో సంస్కరణలు సమాజంలో బ్రాహ్మణులకున్న గౌరవాన్ని పోగోడుతున్నాయని,అనాదిగా వస్తున్న ఆచార, సాంప్రదాయాలను బ్రష్టు పట్టిస్తున్నాయని వాపోయాడు.
వివాహ సాంప్రదాయాలలో కోర్టుల జోక్యం హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ఉండటాన్ని సమర్థించాడు.
హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం వివాహం పవిత్రమని భార్యలు ఎంత హింసకు గురైనా ఆ బంధాన్ని పవిత్రతను గౌరవిస్తారని..ఇటువంటి గొప్ప సాంప్రదాయాన్ని సంస్కరణ పేరుతో మార్పులు చేయాలని చూస్తున్నారని వాపోయాడు.
మహిళలు, బహుజన శూద్రుల విద్య,స్వేచ్ఛ, సమానత్వం కోసం అహిర్నశలు శ్రమించిన జ్యోతి బాపూలే పై తిలక్ అనుచరులు హత్యాయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
హిందూ మతంలో సంస్కరణలు, సమానత్వం కోసం పోరాడిన ప్రతీ సంస్కరణ వాదినీ హిందూ ద్రోహులు,బ్రిటిష్ తొత్తులుగా చూసి తిలక్ తన జీవితాంతం వ్యతిరేకించాడు.
ఆఖరికి చనిపోయే రెండు సంవత్సరాల ముందు కూడా అంటరానితనం నిషేధాన్ని వ్యతిరేకించాడు.
బొంబే రాష్ట్రంలో ప్లేగు ప్రభలినప్పుడు హిందువుల కోసం తిలక్ ప్రత్యేకంగా ఏర్పరచిన సంస్థ కింద కార్యక్రమాలలో నిమ్నకులాలకు చోటు లేదు...ఆపద సమయంలో కూడా కుల వ్యవస్థ ను దాటిరాని గొప్ప మానవత్వం..🙄
ఈకాలంలోనే ప్లేగు నివారణకు బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన కఠినమైన చర్యలు హిందువుల సామాజిక ధర్మాలలో కలుగచేసుకుంటున్నాయని తన పత్రికలలో విమర్శలు చేస్తే దేశ ద్రోహం క్రింద శిక్ష పడింది. ఈ కాలంలో నే సావిత్రి భాయి ఫూలే ప్లేగు నివారణకు కృషి చేస్తుంటే ఆ వ్యాధికి గురై మరణించారు.
జాతీయ ఉధ్యమంలో భాగంగా తిలక్ ప్రారంభించిన గణేష్, శివాజీ పండుగలు హిందూ మత చాంధసవాదానికి ప్రతీకలై హిందూ-ముస్లిం అల్లర్లు పెరిగి ముస్లింలు స్వాతంత్ర్య ఉధ్యమానికి దూరమవడానికి కారణమయ్యాయి.
బక్రీద్ పండగప్పుడు పశు వధను వ్యతిరేకించడం,ఆవు సంరక్షణ వంటి కార్యక్రమాలు ఈ దూరాన్ని మరింత పెంచాయి.
తన పుస్తకం "The Arctic Home in the Vedas" ఆర్య జాతి గొప్పదనాన్ని పొగుడుతూ.. ఆధిపత్య భావజాల నగ్న ప్రదర్శన చేశాడు.
బ్రిటిష్ వారిని వ్యతిరేకించడం అదీ బ్రాహ్మణేతరులకు,మహిళలకు సమాన హక్కులు లేని స్వరాజ్యం కోసం పోరాడిన హిందూ మత చాంధసవాది బాలగంగాధర్ తిలక్ మన చరిత్రలో ఇంత గొప్ప స్థానాన్ని పొందడం ఎలా జరిగింది ?
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విశ్వజనీన భావనలకు ఆయన భావజాలం, వ్యక్తిత్వం..ఇప్పటి కాలం తర్వాత సంగతి కనీసం ఆ కాలంలో సంస్కరణ,స్వాతంత్ర్య ఉధ్యమంలో ఉన్న మహగోవింద రనడే లాంటి సహ బ్రాహ్మణ ఉదారవాదితో పోల్చినా ఎంతవరకు దగ్గరకు వస్తాయి.
మరి తిలక్ గురించి మన చరిత్రలో పేజీలు పేజీలు చదువుతాము..అదే కాలంలో ఆయన కన్నా మూడు దశాబ్దాలు ముందు పుట్టి సమాజాన్ని సమానత్వం,స్వేచ్ఛ,హేతువాదమనే అత్యున్నత భావనలతో చూసిన మహాత్మా జ్యోతీ బాపూలేకి చరిత్ర లో అంత స్థానం ఇవ్వని చరిత్ర కారులని ఏమనాలి?
చరిత్ర ఎవరు రాస్తే వాళ్ళ కులంలో వాళ్ళలో చెడును చీమంత చూపి మంచిని కొండంత చూసే వాళ్ళనసలు చరిత్ర కారులనాలా ?
తిలక్ స్వాతంత్ర్య పోరాటం ఎలాంటిదంటే ఇంట్లో భార్యని చిత్ర హింసలు పెట్టి బయటకొచ్చి గృహ హింస మీద పోరాటం చేయడం లాంటిదనమాట.రాజకీయ స్వాతంత్ర్యమంటే బ్రాహ్మణ మగవారి స్వాతంత్ర్యమని ఆయన జీవితం గురించి అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది.
మరి నెహ్రూ, గాంధీలకు ఆయనలో ఏమి నచ్చి పొగిడారో,బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్ర్య ఉధ్యమాన్ని మన చరిత్రలో ఎందుక ఎక్కువగా కీర్తించారో… వేదాలు రాసిన ఆర్య దేవుళ్ళకే ఎరుక..😄🙂
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి