మోదీ రాజకీయ జీవితంపై నా అభిప్రాయం

 మోదీ రాజకీయ జీవితం పై నా అభిప్రాయం 


గుజరాత్ అల్లర్లు జరిగేనాటికి టీనేజ్ వయస్సు లో ఉండడం వలన పెద్దగా ఒక అభిప్రాయంకి రాలేదు ఒక విశ్లేషణ కూడా  చేయలేదు.2007 గుజరాత్ ఎన్నికల సమయానికి వాజపేయి, అద్వానీ ల కనుసన్నలలో బీజేపీ పార్టీ ఉండడంతో మోదీ మీద పెద్దగా దృష్టి నిలపలేదు.2012 గుజరాత్ ఎన్నికలను మటుకు చాలా దగ్గరగా పరిశీలించాను.ఆ ఎన్నికల్లో కమ్యూనల్ అజెండా ఉన్నప్పటికీ అభివృద్ధి,గుజరాత్ ఆత్మగౌరవం మీద ప్రధానంగా ఎన్నికలు జరిగాయి.

కాకపోతే గుజరాత్ అల్లర్లలో మోదీ మీద కేసులు కొట్టేయడంతో ఆ అల్లర్ల చరిత్ర ను పెద్ద గా నేను చదవలేదు అలాగే కాంగ్రెస్ పార్టీ విధాన వికలత్వంతో దేశంలో వచ్చిన అసంతృప్తి నాలో కూడా ఉంది.కాంగ్రెసు మీద ఆగ్రహం మోదీ గత చరిత్ర ను పూర్తిగా చదవకుండా చేసిందనే అనుకోవచ్చు.ఇది ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా ఒక రాజకీయ నాయకుడి గురించి పూర్తిగా అధ్యయనం చేయకుండా ఒక అభిప్రాయం(పాజిటివ్ అయితే కాదు నెగిటివ్ అభిప్రాయమే ఉండేది కానీ పూర్తిగా వ్యతిరేకించే విధంగా అయితే లేదు)కి రావడం నేను చేసిన పెద్ద తప్పు.ఇలా 2014 ఎన్నికల సమయానికి మోదీపై పాజిటివ్ అభిప్రాయం లేకపోయినా ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంనైతే వ్యతిరేకించలేదు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి వాజపేయి ప్రభుత్వం లాగా ఉంటుందేమో అనుకున్న.ఆ ఎన్నికల సమయంలోనే గుజరాత్ అల్లర్లు, ఆయన పూర్వపు రాజకీయ జీవితం గురించి పూర్తిగా అధ్యయనం చేసేసమయానికి ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేసాయి.

గుజరాత్ అల్లర్లు మోదీ రాజకీయ జీవితం హేతువాద దృక్పథం తో అధ్యయనం చేస్తే నాకు తెలిసి ఎవ్వరూ మోదీని ప్రధానమంత్రి గా అంగీకరించరు.


ఇక ప్రధానమంత్రి అయ్యాక ఏమన్నా మార్పు వస్తుంది అనుకుంటే లేదు రాకపోగా గుజరాత్ లో ఎలా కొంతమంది ఐఏఎస్ అధికారులతో  పరిపాలించాడో అలానే దేశాన్ని కూడా కొద్దిమంది కోటరీతో పరిపాలన సాగించాడు.మత సామరస్యం పరంగా ఎలాను ఆశలేదు ఆర్థిక విధానాల పరంగానూ దేశాన్ని అధోగతి పాలు చేశాడు. 


దేశంలో చాలా మంది మోసపూరిత స్వభావం, అధికార దాహం ఉన్న రాజకీయ నాయకులు ఇతర పార్టీల లో ఉన్నారు కాకపోతే మోదీ కి అధనంగా కరడుగట్టిన  హిందూత్వ భావజాలం ఉంది.అందుకే ఆయన దేశానికి చాలా ప్రమాధ కరం.

ఎన్నికల ప్రచారాలలో హిందూ-ముస్లిం విభజించు-పాలించు విధానం, రాజ్యాంగ సంస్థలను స్వంత ప్రయోజనాలకు వాడుకోవడం, ఇతర మంత్రులను నిర్ణయాధికారం ఇవ్వకపోవడం, ఎప్పుడూ ఎన్నికల ఎలా గెలుద్దాము అందుకోసం చివరికి తనను వ్యతిరేకించిన వారిని దేశ ద్రోహులు గా ముద్ర వేయడం,సాక్షాత్తు మాజీ ప్రధానమంత్రి నే పాకిస్థాన్తో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేయడం,జాతీయ భావాన్ని రెచ్చగొట్టి భారత సైన్యాన్ని రాజకీయాలకు వాడడం,వ్యక్తి స్వామ్యాన్ని పరాకాష్టకు తీసుకెళ్లి ప్రధానమంత్రి పదవి ఔన్యత్యాన్ని చాలా వరకు దిగచార్చే రాజకీయాలు చేశాడు.ఇక సైంటిఫిక్ టెంపర్ కి వ్యతిరేకంగా గణేశా ప్లాస్టిక్ సర్జరీ లాంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా యాంటీ సైంటిఫిక్ భావజాలం ఈ ఐదేళ్ళలో ప్రాచీన భారత హిందూ స్వర్ణ యుగం పేరుతో బాగా ప్రచారం చేశారు.


గుజరాత్ అల్లర్లలో ముస్లింలు చనిపోవడం గురించి 

కారు వెళుతుంటే కుక్క పిల్ల అడ్డొచ్చి చనిపోతే ఏం చేయగలం బాధపడతాం ప్రతీ ప్రాణం విలువైనదే అని ముస్లింలను కుక్కపిల్లలతో పోల్చడం 

హమ్ పాంచ్ హై హమారా పచ్చీస్ హై(ముస్లింల జనాభా పెరుగుదల గురించి).లాంటి వ్యాఖ్యలు

మెజార్టీ -మైనార్టీ విభజన,,గో పరిరక్షణ పేరుతో దళితులు, ముస్లింలపై దాడులు పై పెద్దగా ప్రతిస్పందించకపోవడం,కార్యకర్తలకి ఇలాంటి విషయాల్లో పూర్తి స్వేచ్ఛ నిచ్చి కొంతమందిని మంత్రులు దగ్గర నుంచి ఎంకరేజ్ చేయడం లాంటివి కొన్ని  దిగజారుడు రాజకీయాలకు ఉదాహరణలు.


క్రోనీ క్యాపటలిజం విపరీతంగా పెరిగింది.

డీమానిటైజేషన్ అప్పటి యూపీ ఎన్నికలలో వాడాక అది తర్వాత కాలంలో విఫలం చెందడంతో దాని గురించి ఒక్కమాట కూడ మాట్లాడకపోవడం,ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వకపోవడం,ఎక్కువగా ర్యాలీలలో పాల్గొని  పార్లమెంట్ ని నిర్లక్ష్యం చేయడం ఇలా ఒంటెద్దు పోకడలు ఈ ఐదేళ్ళ లో కోకొల్లలు 

తన ఐదేళ్ళ పరిపాలన పై రిఫరెండం కాకుండా పాకిస్థాన్, విభజించు-పాలించు, హిందువులు ప్రమాదంలో ఉన్నారు లాంటి ఊహాజనిత శత్రువులను సృష్టించి గెలవాలి అనుకుంటున్నాడు.

He is the most dangerous prime minister indian democracy  has ever witnessed and another term would be a great disaster both for indian democracy and social fabric of our country .

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి?