పాకిస్థాన్ చరిత్ర క్లుప్తంగా
పాకిస్థాన్ ఈ పోస్ట్ ప్రధానంగా ఈ క్రింది పుస్తకాల ఆధారంగా రాయడం జరిగింది. Hussain Haqqani 1.Pakistan: Between Mosque and Military 2.Magnificent Delusions: Pakistan, the United States, and an Epic History of Misunderstanding. Christine Fair 3.Fighting to the End: The Pakistan Army's Way of War పాకిస్థాన్ మన దాయాది దేశం.ఆ దేశ చరిత్ర మరి ఎంతమంది భారతీయులకు తెలుసో ఏమోగానీ ఆ దేశం పేరు వింటే మన దేశంలో జనాలకు ఎక్కువగా గుర్తుకు వచ్చే విషయాలు కాశ్మీర్, తీవ్రవాదం,క్రికెట్,ముస్లింలు,చరిత్రలో చదువుకున్న ఉపఖండ విభజన.మనతో పాటే కలసి పంచుకున్న సంస్క్రతి ఉన్న దేశం.కానీ ఎందుకిలా ఇస్లామిక్ రిపబ్లికై తీవ్ర వాదానికి కేంద్ర బిందువైంది.ఏదైనా దేశంలో మతం పరిపాలనలో పాత్ర వహిస్తే జరిగే అనర్థాలకు పాకిస్థాన్ కన్నా మంచి ఉదాహరణ ఉండదు.ఈ దేశ చరిత్ర మనకు ప్రత్యేకంగా హిందూ జాతీయ వాదులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు కూడా మతం పేరుతో మన దేశ విభిన్న సంస్క్రతిపై ఏకరూపత సంస్క్రతిని బలవంతంగా రుద్దుదామనుకుంటున్నారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు ఎక్కువ ఆసక్తి గల నాకు పాకిస్...