పోస్ట్‌లు

పాకిస్థాన్ చరిత్ర క్లుప్తంగా

 పాకిస్థాన్  ఈ పోస్ట్ ప్రధానంగా ఈ క్రింది పుస్తకాల ఆధారంగా రాయడం జరిగింది. Hussain Haqqani  1.Pakistan: Between Mosque and Military 2.Magnificent Delusions: Pakistan, the United States, and an Epic History of Misunderstanding. Christine Fair  3.Fighting to the End: The Pakistan Army's Way of War పాకిస్థాన్ మన దాయాది దేశం.ఆ దేశ చరిత్ర మరి ఎంతమంది భారతీయులకు తెలుసో ఏమోగానీ ఆ దేశం పేరు వింటే మన దేశంలో జనాలకు ఎక్కువగా గుర్తుకు వచ్చే విషయాలు  కాశ్మీర్, తీవ్రవాదం,క్రికెట్,ముస్లింలు,చరిత్రలో చదువుకున్న ఉపఖండ విభజన.మనతో పాటే కలసి పంచుకున్న సంస్క్రతి ఉన్న దేశం.కానీ ఎందుకిలా ఇస్లామిక్ రిపబ్లికై తీవ్ర వాదానికి కేంద్ర బిందువైంది.ఏదైనా దేశంలో మతం పరిపాలనలో పాత్ర వహిస్తే జరిగే అనర్థాలకు పాకిస్థాన్ కన్నా మంచి ఉదాహరణ ఉండదు.ఈ దేశ చరిత్ర మనకు ప్రత్యేకంగా హిందూ జాతీయ వాదులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు కూడా మతం పేరుతో మన దేశ విభిన్న సంస్క్రతిపై ఏకరూపత సంస్క్రతిని బలవంతంగా రుద్దుదామనుకుంటున్నారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు ఎక్కువ ఆసక్తి గల నాకు పాకిస్...

తిలక్ హిందూ చాంధసవాద పితామహ

 తిలక్-----హిందూ చాంధసవాద పితామహ. ఇవ్వాల బాలగంగాధర్ తిలక్ వర్థంతి(1856-1920). ఆయనకి లోక మాన్య అని బిరుదు.. గాంధీ ఆయన్ని 'ఆధునిక భారత నిర్మాత' నెహ్రూ 'భారతీయ విప్లవ పిత' అని కొనియాడారు..మరి అంత గొప్ప మహానుభావుడు..ఆ కాలంలో వ్యక్త పరిచిన భావాలు,ఘనకార్యాలు ఒకసారి చూద్దామా..  ఆయనిచ్చిన గొప్ప నినాదం "స్వరాజ్యం నా జన్మ హక్కు"..సూపర్...చాలా బాగుంది కదా మరి ఆ స్వరాజ్యంలో ఎవరికి చదువుకొని సమాన హక్కులు పొందే అవకాశం ఉంది?  మహిళలకు విద్యను వ్యతిరేకించాడు.ముఖ్యంగా ఆంగ్ల విద్య చదివితే భారతీయ సంస్కృతి విలువలు కోల్పోయి నైతికతను కోల్పోతారు. గృహస్థ ధర్మాలను విడచి గర్వం పెరిగి భర్తకు భారంగా మారతారు.అందుకే వాళ్ళకు  కుటుంబ వ్యవహారాలు చూసుకునే విదంగా చిన్నపాటి విద్యా బుద్ధి ఉంటే చాలు.మగవాళ్ళు మాత్రమే చదువుకొని రాజకీయ సామాజిక వ్యవహారాలు నడపాలి.చరిత్రలో మగవారే ఈ పాత్ర పోషించారు.స్థానికంగా పూలే  లాంటి సంస్కరణ వాదులు బాలికల పాఠశాలలు తెరవడాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. సంస్కరణ వాదుల కృషి తో విద్య ఉద్యోగాలలో బ్రాహ్మణ ఆధిపత్యం తగ్గిపోతుండడంతో అందరికీ విధ్య విధానాన్ని వ్యతిరేకించాడు.ఏ కులం ...

సతి, బాల్య వివాహాలు, శాశ్వత వైధవ్యం దురాచారాల పుట్టుక -కుల వ్యవస్థ

 సతీ సహగమనం, వితంతు పునర్వివాహ నిషేధం, బాల్యవివాహం-కుల వ్యవస్థ. కుల వ్యవస్థ ప్రధాన లక్షణం పెళ్ళిళ్ళు అదే కులంలో చేసుకోవడం(Endogamy).కులాంతర వివాహాలు జరిగితే కుల వ్యవస్థ ఉండేదే కాదు. మరి కులాంతర వివాహాలను ఎలా నిషేధించగలిగారు ?  ఇలా మొదట ఏ గ్రూపు  ప్రారంభించింది ?  దీనికి హిందూ మతంలోని దురాచారాలైన  సతీ సహగమనం,వితంతు పునర్వివాహ నిషేధం, బాల్య వివాహంలకు సంబంధమేమిటి అనే ప్రశ్నలకు  అంబేద్కర్ 1916 లో (కొలంబియా యూనివర్సిటీ)ఆంత్రోపాలజీ సెమినార్ కి  సమర్పించిన  పరిశోధన పత్రం Castes in India,Their mechanism,Genesis and Development మనకు సమాధానాలు లభిస్తాయి. ఒకే గ్రూపులో ఆడ మగ (యువతీయువకులు) సమానమైన సంఖ్యలో ఉంటేనే గ్రూపు బయట వారితో వివాహం చేసుకునే అవసరం రాదు.కానీ ఇది ప్రాక్టికల్ గా  సాధ్యం కాదు.ఎందుకంటే సాధారణంగా  భార్య,భర్తలూ ఒకేసారి చనిపోరు.భర్తలు  చనిపోతే అదనపు మహిళలు,భార్యలు చనిపోతే అదనపు మగవారు ఉంటారు. వీరికి మళ్ళీ అదే గ్రూపులో పెళ్ళి చేయాలి లేకపోతే వేరే గ్రూపు వాళ్ళ అవసరం పడుతుంది.ఇ‌లా వేరే గ్రూపుని ఆశ్రయిస్తే కులానికి అర్థమే ఉండదు. మరి దీన...

నెహ్రూ కంటే పటేల్ బోస్ లు మెరుగైన నాయకత్వం అందించేవారా -చరిత్ర లో ఉదాహరణ

  రెండవ ప్రపంచ యుద్ధం-భారతీయ స్వాతంత్ర్య ఉధ్యమ నాయకత్వ నైతిక డైలమా…… రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యాక 1940లలో నాజీ జర్మనీ యూరోప్ లో వరుసగా సాధించిన విజయాలు, ఫాసిస్టు జపాన్ సింగపూర్,బర్మాలపై విజయాలు చూసిన తర్వాత యాక్సిస్ కూటమి దేశాలు సంకీర్ణ కూటమి(అమెరికా, యూకే….)మీద విజయం సాధిస్తాయని పటేల్, గాంధీలతో సహా చాలామంది నిర్ణయానికొచ్చారు.. బర్మా రంగూన్ దాకా వచ్చిన జపాన్ ను ఎలా ఎదుర్కోవాలా అని డైలమాలో పడ్డారు.. 1942 అల్హాబాద్ లో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దీని మీద మల్లగుల్లాలు పడింది… బ్రిటిష్  ఇండియాని జపాన్ నుంచి కాపాడలేరు కావున ఏదోవిధంగా జపాన్ తో ఒప్పందం కుదుర్చుకోవాలి వాళ్ళ యుద్ధం బ్రిటిష్ తో కాబట్టి ఇండియా నుంచి జపనీస్  ఆర్మీ మధ్య ప్రాశ్చ (Middle East-West Asia ) దేశాలకు వెళ్ళేవిధంగా సహకరిస్తే ఇక్కడ పౌరుల మీద దాడులు చేయరు అని గాంధీ మొదటి రోజు ముసాయిదా తీర్మానం తయారు చేశారు.. అంటే ఫాసిస్టు జపాన్ ప్రణాలికలో ఇండియా ఆక్రమణ లేదు అనే ఆలోచన తో ఈ ముసాయిదా ఉందనమాట.. దీనికి నెహ్రూ విభేధించాడు.. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి బ్రిటిష్ కి మద్దతు తెలుపకపోయినా నాజీ-ఫాసిస్టు  జ...

హిందూ సమాజం-జీవన విధానం-ఇస్లాం-మన చరిత్ర-రాజ్యాంగం-హిందూ-ఇస్లామిక్ రాజ్యాలు.

  హిందూ సమాజం-జీవన విధానం-ఇస్లాం-మన చరిత్ర-రాజ్యాంగం-హిందూ-ఇస్లామిక్ రాజ్యాలు. ఎవడి కులం గోల వాడు చూసుకుంటూ,అనైక్యత తో,కుల వివక్ష, అంటరానితనం పాటించడం, నిచ్చెన మెట్ల వ్యవస్థ లో బావిలో కప్పలా ఉండటం  సహనం, లౌకికత్వం కాదు అది బలహీనత,అనైతికత. మన దేశం విదేశీ దాడులు ఎక్కువ ఎదుర్కోవడంలో వైఫల్యం ఇక్కడ రాజ్యాలలో అనైక్యత.. ఒక సమాజం,ఒక దేశం అనే భావన లేకపోవడం.. సమాజంలో కొన్ని కులాలకే చదువు పరిమితి చేయడం వలన knowledge diffusion జరగలేదు..దీనివలన ఆవిష్కరణలు జరగలేదు.. వృత్తులు పుట్టుకతో నిర్ణయం చేయడం వలన ఆధునికత సాంకేతికత లో వెనకబడ్డాం  సామాజిక సంస్కరణకు ప్రయత్నించిన వాళ్ళని ఆధిపత్య కులాల వారు ఎప్పటికప్పుడు అదుపులో పెట్టారు.. భగవద్గీత, ఉపనిషత్తులు ఎప్పుడు ఎందుకు రాయబడ్డాయో ఒకసారి  సామాజిక చరిత్ర చదివితే అర్థం అవుతుంది అవి బుద్దుడు తెచ్చిన సామాజిక విప్లవానికి వ్యతిరేకంగా బ్రాహ్మణిజం ఆధిపత్యం కోసం రాసినవి.. వాటి శ్లోకాలు అర్థాలు కర్మ సిద్దాంతం చదివితే అర్థం అవుతుంది.. మరి హిందూ మతం క్రైస్తవం, ఇస్లాం లాగా ఎందుకు ఇతర దేశాలకు వ్యాప్తి చెందలేదు ? ఎందుకంటే దానికంటూ ఒక ఫిలసాఫికల్ బేస్ లేదు,...

అమెరికా అధ్యక్షుడు ఎన్నిక ఎలా జరుగుతుంది?

  అమెరికా ప్రెసిడెంట్ ని ఎన్నుకునేది ఎలక్ట్రోరల్ కాలేజీ  అందులో మెంబర్ల సంఖ్య 538.  ఈ నంబర్ ఎలా నిర్ణయం చేశారంటే  మన పార్లమెంట్ లానే అక్కడ కూడా లెజిస్లేటర్ లో(కాంగ్రెస్ అంటారు) రెండు  సభలు ఉంటాయి  ఎగువ సభ(సెనేట్) దిగువ సభ (ప్రతినిధుల సభ -House of Representatives )  ఇక్కడ సెనేట్ లో 100 మంది అంటే ప్రతీ రాష్ట్రానికి ఇద్దరు సెనెటర్లు ఉంటారు జనాభా తో సంబంధం లేకుండా.. ప్రతినిధులు సభలో  438 మంది సభ్యులు ఉంటారు.ఇది దాదాపు జనాభా ప్రాతిపదికన నిర్ణయం చేస్తారు.. ఎలక్ట్రోరల్ కాలేజ్ మెంబర్ల సంఖ్య 100+438=538 ఇలా వచ్చిందనమాట.. ప్రతీ రాష్ట్రానికి సెనేట్ (2) మరియు ప్రతినిధుల సభలో ఎంతమంది ఉంటే అంతమంది కలిపి ఆ రాష్ట్రంలో ఎలక్ట్రోరల్ కాలేజీ సంఖ్య ను నిర్ణయం చేస్తారు.. ఉదాహరణకు కాలిఫోర్నియా రాష్ట్రంలో 53 మంది ప్రతినిధుల సభ మెంబర్లు సెనేట్ ఇద్దరితో కలిపి 55 అవుతుంది.. ప్రతీరాష్ట్రంలో ఈ ఎలక్ట్రోరల్ కాలేజ్ మెంబర్లను పార్టీ తరుపున నామినేట్ చేస్తారు.. ఓటింగ్ వీరిని ఎన్నుకోవడానికి జరుగుతుంది.. ఎలాగంటే ఆ రాష్ట్రంలో మెజార్టీ ఓట్లు ఏపార్టీకి వస్తే మొత్తం సీట్లు ఆ పార్టీ కే వెళ...

హేతువు మరియు నైతికత సంస్కరణ వాది అమ్ముల పొదిలో ఉన్నటువంటి గొప్ప ఆయుధాలు.అవి లేకుండా సంస్కరణ వాదిని ముందుకెళ్ళమంటే సంస్కరణని ఆపడమే .కులం అనేది నైతికత హేతుబద్దతల ప్రకారం ఉందా అని విశ్లేషణ చేయకుండా దాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తారు?

  Reason and morality are the two most powerful weapons in the armoury of a reformer. To deprive him of the use of these weapons is to disable him for action. How are you going to break-up caste, if people are not free to consider whether it accords with reason? How are you going to break-up caste, if people are not free to consider whether it accords with morality? Dr.Br.Ambedkar. హేతువు మరియు నైతికత  సంస్కరణ వాది అమ్ముల పొదిలో ఉన్నటువంటి గొప్ప ఆయుధాలు.అవి లేకుండా సంస్కరణ వాదిని ముందుకెళ్ళమంటే సంస్కరణని ఆపడమే .కులం  అనేది నైతికత హేతుబద్దతల ప్రకారం ఉందా అని విశ్లేషణ చేయకుండా దాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తారు? "The upper caste subordination of the dalit-bahujan people was carried actively  during the anti-colonial struggle. The national leadership, contrary to the official depiction, did not strive to build a casteless, equalitarian ideology. Instead, brahmanical ideologues eulogized the caste culture and structure of ancient India in the name of nationalism. From Rammoh...