మోదీ రాజకీయ జీవితంపై నా అభిప్రాయం
మోదీ రాజకీయ జీవితం పై నా అభిప్రాయం గుజరాత్ అల్లర్లు జరిగేనాటికి టీనేజ్ వయస్సు లో ఉండడం వలన పెద్దగా ఒక అభిప్రాయంకి రాలేదు ఒక విశ్లేషణ కూడా చేయలేదు.2007 గుజరాత్ ఎన్నికల సమయానికి వాజపేయి, అద్వానీ ల కనుసన్నలలో బీజేపీ పార్టీ ఉండడంతో మోదీ మీద పెద్దగా దృష్టి నిలపలేదు.2012 గుజరాత్ ఎన్నికలను మటుకు చాలా దగ్గరగా పరిశీలించాను.ఆ ఎన్నికల్లో కమ్యూనల్ అజెండా ఉన్నప్పటికీ అభివృద్ధి,గుజరాత్ ఆత్మగౌరవం మీద ప్రధానంగా ఎన్నికలు జరిగాయి. కాకపోతే గుజరాత్ అల్లర్లలో మోదీ మీద కేసులు కొట్టేయడంతో ఆ అల్లర్ల చరిత్ర ను పెద్ద గా నేను చదవలేదు అలాగే కాంగ్రెస్ పార్టీ విధాన వికలత్వంతో దేశంలో వచ్చిన అసంతృప్తి నాలో కూడా ఉంది.కాంగ్రెసు మీద ఆగ్రహం మోదీ గత చరిత్ర ను పూర్తిగా చదవకుండా చేసిందనే అనుకోవచ్చు.ఇది ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా ఒక రాజకీయ నాయకుడి గురించి పూర్తిగా అధ్యయనం చేయకుండా ఒక అభిప్రాయం(పాజిటివ్ అయితే కాదు నెగిటివ్ అభిప్రాయమే ఉండేది కానీ పూర్తిగా వ్యతిరేకించే విధంగా అయితే లేదు)కి రావడం నేను చేసిన పెద్ద తప్పు.ఇలా 2014 ఎన్నికల సమయానికి మోదీపై పాజిటివ్ అభిప్రాయం లేకపోయినా ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థిత...