పోస్ట్‌లు

అమెరికా అధ్యక్షుడు ఎన్నిక ఎలా జరుగుతుంది?

  అమెరికా ప్రెసిడెంట్ ని ఎన్నుకునేది ఎలక్ట్రోరల్ కాలేజీ  అందులో మెంబర్ల సంఖ్య 538.  ఈ నంబర్ ఎలా నిర్ణయం చేశారంటే  మన పార్లమెంట్ లానే అక్కడ కూడా లెజిస్లేటర్ లో(కాంగ్రెస్ అంటారు) రెండు  సభలు ఉంటాయి  ఎగువ సభ(సెనేట్) దిగువ సభ (ప్రతినిధుల సభ -House of Representatives )  ఇక్కడ సెనేట్ లో 100 మంది అంటే ప్రతీ రాష్ట్రానికి ఇద్దరు సెనెటర్లు ఉంటారు జనాభా తో సంబంధం లేకుండా.. ప్రతినిధులు సభలో  438 మంది సభ్యులు ఉంటారు.ఇది దాదాపు జనాభా ప్రాతిపదికన నిర్ణయం చేస్తారు.. ఎలక్ట్రోరల్ కాలేజ్ మెంబర్ల సంఖ్య 100+438=538 ఇలా వచ్చిందనమాట.. ప్రతీ రాష్ట్రానికి సెనేట్ (2) మరియు ప్రతినిధుల సభలో ఎంతమంది ఉంటే అంతమంది కలిపి ఆ రాష్ట్రంలో ఎలక్ట్రోరల్ కాలేజీ సంఖ్య ను నిర్ణయం చేస్తారు.. ఉదాహరణకు కాలిఫోర్నియా రాష్ట్రంలో 53 మంది ప్రతినిధుల సభ మెంబర్లు సెనేట్ ఇద్దరితో కలిపి 55 అవుతుంది.. ప్రతీరాష్ట్రంలో ఈ ఎలక్ట్రోరల్ కాలేజ్ మెంబర్లను పార్టీ తరుపున నామినేట్ చేస్తారు.. ఓటింగ్ వీరిని ఎన్నుకోవడానికి జరుగుతుంది.. ఎలాగంటే ఆ రాష్ట్రంలో మెజార్టీ ఓట్లు ఏపార్టీకి వస్తే మొత్తం సీట్లు ఆ పార్టీ కే వెళ...

హేతువు మరియు నైతికత సంస్కరణ వాది అమ్ముల పొదిలో ఉన్నటువంటి గొప్ప ఆయుధాలు.అవి లేకుండా సంస్కరణ వాదిని ముందుకెళ్ళమంటే సంస్కరణని ఆపడమే .కులం అనేది నైతికత హేతుబద్దతల ప్రకారం ఉందా అని విశ్లేషణ చేయకుండా దాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తారు?

  Reason and morality are the two most powerful weapons in the armoury of a reformer. To deprive him of the use of these weapons is to disable him for action. How are you going to break-up caste, if people are not free to consider whether it accords with reason? How are you going to break-up caste, if people are not free to consider whether it accords with morality? Dr.Br.Ambedkar. హేతువు మరియు నైతికత  సంస్కరణ వాది అమ్ముల పొదిలో ఉన్నటువంటి గొప్ప ఆయుధాలు.అవి లేకుండా సంస్కరణ వాదిని ముందుకెళ్ళమంటే సంస్కరణని ఆపడమే .కులం  అనేది నైతికత హేతుబద్దతల ప్రకారం ఉందా అని విశ్లేషణ చేయకుండా దాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తారు? "The upper caste subordination of the dalit-bahujan people was carried actively  during the anti-colonial struggle. The national leadership, contrary to the official depiction, did not strive to build a casteless, equalitarian ideology. Instead, brahmanical ideologues eulogized the caste culture and structure of ancient India in the name of nationalism. From Rammoh...

బాలగంగాధర్ తిలక్ దృష్టిలో స్వరాజ్యం

  ఇవ్వాల బాలగంగాధర్ తిలక్ వర్థంతి(1854-1920). ఆయనకి లోక మాన్య అని బిరుదు.. గాంధీ ఆయన్ని 'ఆధునిక భారత నిర్మాత' నెహ్రూ 'భారతీయ విప్లవ పిత' అని కొనియాడారు..మరి అంత గొప్ప మహానుభావుడు..ఆ కాలంలో వ్యక్త పరిచిన భావాలు,ఘనకార్యాలు ఒకసారి చూద్దామా..  ఆయనిచ్చిన గొప్ప నినాదం "స్వరాజ్యం నా జన్మ హక్కు"..సూపర్...చాలా బాగుంది కదా మరి ఆ స్వరాజ్యంలో ఎవరికి చదువుకొని సమాన హక్కులు పొందే అవకాశం ఉంది?  మహిళలకు విద్యను వ్యతిరేకించాడు.ముఖ్యంగా ఆంగ్ల విద్య చదివితే భారతీయ సంస్కృతి విలువలు కోల్పోయి నైతికతను కోల్పోతారు. గృహస్థ ధర్మాలను విడచి గర్వం పెరిగి భర్తకు భారంగా మారతారు.అందుకే వాళ్ళకు  కుటుంబ వ్యవహారాలు చూసుకునే విదంగా చిన్నపాటి విద్యా బుద్ధి ఉంటే చాలు.మగవాళ్ళు మాత్రమే చదువుకొని రాజకీయ సామాజిక వ్యవహారాలు నడపాలి.చరిత్రలో మగవారే ఈ పాత్ర పోషించారు.స్థానికంగా పూలే  లాంటి సంస్కరణ వాదులు బాలికల పాఠశాలలు తెరవడాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. సంస్కరణ వాదుల కృషి తో విద్య ఉద్యోగాలలో బ్రాహ్మణ ఆధిపత్యం తగ్గిపోతుండడంతో అందరికీ విధ్య విధానాన్ని వ్యతిరేకించాడు.ఏ కులం వారు ఆ కుల వృత్తి కి సంభంధించిన ...

ఓల్గా నుండి గంగకు-రాహుల్ సాంస్కృతయాన్ పుస్తకం రివ్యూ

  రాహుల్ సాంకృతయాన్-ఓల్గా నుంచి గంగకు-పుస్తక సంక్షిప్త విశ్లేషణ. ఈ  పుస్తకం తెలుగు,హిందీ,మరియు ఆంగ్ల భాషలలో దొరుకుతుంది.  చరిత్రలో ఎనిమిది వేల ఏళ్ళలో సమాజం ఎలా మార్పులు చెందిందో కాల్పనిక(ఊహాజనిత)కథలతో ఇండో యూరోపియన్ ఆర్యన్ తెగలను ఉదాహరణగా తీసుకుని రాశారు. క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరాల క్రింద ఓల్గా నది(రష్యాలో) ఒడ్డున నివసించిన మాతృస్వామ్య వ్యవస్థని వివరిస్తూ కుటుంబాలు సమూహాలు ఎలా ఉండేవి నిష అనే కథ ద్వారా ప్రారంభిస్తారు.ఆ తర్వాతి కథ కూడా మాతృస్వామ్య వ్యవస్థదే. ఆ సమూహాలు ఎలా తెగలుగా మారాయి, ఇండియా వైపు పయనం,పశు పాలన మరియువ్యవసాయం ఎలా పరిణామం చెందాయి, తెగల మధ్య ఆధిపత్యం కోసం యుద్ధాలు,పితృస్వామ్య వ్యవస్థగా మారడం‌,పకృతి దేవతలను పూజించడం,లైంగిక సంబంధాల పరిణామం,కొన్ని వందల ఏళ్ళ తర్వాత స్వేచ్ఛ జీవనం నుండి బానిసత్వానికి మారడం,వర్ణ వ్యవస్థ ఏర్పడడం,వృత్తుల విభజన,ఆధిపత్యం కోసం కుల వ్యవస్థ ప్రారంభం,గ్రీకు,పర్షియన్ లాంటి మద్యప్రాచ్యదేశాలతో భారతీయుల సంబంధాలు,ప్రాచీన భారత దేశంలో విధ్య వైద్యం,భారత సమాజం కూపస్థమండూకమై తిరోగమన బాట పట్టడం,మహమ్మదీయుల రాక,హిందూ ముస్లిం సంబంధాలు, బ్రిటిష్ ప...

మానవవాదం ఆలోచన దృక్పథం

  Humanism is a philosophical and ethical stance that emphasizes the value and agency of human beings, individually and collectively, and prefers critical thinking and evidence (rationalism and empiricism) over acceptance of dogma or superstition. మానవ వాదం మనిషిని మనిషిగా గుర్తించి నిలబెట్టే వాదం. మానవ వాదం మానిషి హూందాతనానికి విలువనిస్తూ దానిని ఉల్లంఘించే కుల,మత,జాతి,ప్రాంత, వర్గ,లింగ వివక్షలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన బాణం. మానవ వాదం మానవ హక్కులు ప్రాతిపదికగా ఆ హక్కులు ఉల్లంఘన ఎక్కడ ఎవరిపై జరిగినా గళం వినిపించే నాదం.  సామాజిక స్పృహతో సమతను కాంక్షిస్తూనే వ్యక్తి స్వాతంత్ర్యానికీ,స్వేచ్ఛకు ఆ కాంక్ష సంకెలవకుండా సంతులనాన్ని పాటించే విధానం ఈ వాదం.  మానవవాదం  ఏ సంస్కృతి సాంప్రదాయాలైన హేతుబద్దత పరీక్ష కు నిలబడాలని నినదించే వాదం.నిన్న సరనిపించింది ఇవ్వాళ సరికాదని నిరూపణైనప్పుడు దానికి తగ్గట్లు మన దారిని మార్చుకోవమనే సిద్దాంతం.ఇందులో పిడివాదానికి తావులేదు. మానవ సంక్షేమానికి నైతికతతో జీవించడానికి ఏ మతమూ అక్కర్లేదనీ, సహేతుకమైన ఆలోచనతో మనిషి కేంద్రంగా మానవ హక్కులను దృష్టిలో ప...

సతీ సహగమనం, శాశ్వత వైధవ్యం, బాల్య వివాహాల పుట్టుక

  సతీ సహగమనం, వితంతు పునర్వివాహ నిషేధం, బాల్య వివాహాం-కుల వ్యవస్థ. కుల వ్యవస్థ ప్రధాన లక్షణం పెళ్ళిళ్ళు అదే కులంలో చేసుకోవడం(Endogamy).కులాంతర వివాహాలు జరిగితే కుల వ్యవస్థ ఉండేదే కాదు. మరి కులాంతర వివాహాలను ఎలా నిషేధించగలిగారు ?  ఇలా మొదట ఏ గ్రూపు  ప్రారంభించింది ?  దీనికి హిందూ మతంలోని దురాచారాలైన  సతీ సహగమనం,వితంతు పునర్వివాహ నిషేధం, బాల్య వివాహంలకు సంబంధమేమిటి అనే ప్రశ్నలకు  అంబేద్కర్ 1916 లో (కొలంబియా యూనివర్సిటీ)ఆంత్రోపాలజీ సెమినార్ కి  సమర్పించిన  పరిశోధన పత్రం Castes in India,Their mechanism,Genesis and Development మనకు సమాధానాలు లభిస్తాయి. ఒకే గ్రూపులో ఆడ మగ (యువతీయువకులు) సమానమైన సంఖ్యలో ఉంటేనే గ్రూపు బయట వారితో వివాహం చేసుకునే అవసరం రాదు.కానీ ఇది ప్రాక్టికల్ గా  సాధ్యం కాదు.ఎందుకంటే సాధారణంగా  భార్య,భర్తలూ ఒకేసారి చనిపోరు.భర్తలు  చనిపోతే అదనపు మహిళలు,భార్యలు చనిపోతే అదనపు మగవారు ఉంటారు. వీరికి మళ్ళీ అదే గ్రూపులో పెళ్ళి చేయాలి లేకపోతే వేరే గ్రూపు వాళ్ళ అవసరం పడుతుంది.ఇ‌లా వేరే గ్రూపుని ఆశ్రయిస్తే కులానికి అర్థమే ఉండదు. మరి ...

చైనా పాకిస్థాన్లతో నదీ వివాదాలు

  భవిష్యత్తు లో యుద్ధాలు నీళ్లకోసం జరుగుతాయి అని అంటారు. మరి మన  పొరుగు దేశాలైన పాకిస్థాన్ చైనాలతో మన నీటి సంబంధాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఈ పోస్ట్ లో వివరిస్తాను. నీరు ఎంత విలువైన వనరో మనకందరికీ తెలిసిందే త్రాగు నీరు,సాగునీరు, పరిశ్రమలకు ఇలా మన నిత్యావసరాలకు నీరు లేనిదే గడవదు.మరి అటువంటి దాని మీద  దేశాల సంబంధాలు ఆధారపడడం సహజం. ముందుగా మన దాయాది చెల్లెలు పాకిస్థాన్ తో చూద్దాం. ఆ దేశం మన దేశం మధ్య  సింధు నది దాని ఉపనదులైన జీలం,చీనాబ్,రావి,బీయాస్ మరియు సట్లెజ్ నదులు ప్రవహిస్తున్నాయి. బ్రిటీష్ కాలంలో మొత్తం ఒకటే దేశం కాబట్టి సమస్యలు రాలేదు.ఆ కాలంలోనే ఐక్య పంజాబ్ ప్రావిన్స్ లో కాలువల ద్వారా సాగునీటి సదుపాయాలు కొంచం అభివృద్ధి చేశారు. 1947-48 కాశ్మీర్ కోసం జరిగిన ఘర్షణ సమయంలో భారత్ కాలువలు ఆపివేసింది కొంతకాలం.ఆ తర్వాత పాకిస్థాన్ ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉండేది భారత్ నీరు ఆపుతుందని.1954 లో ప్రపంచ బ్యాంకు ఇరుదేశాల మద్య ఈ నదుల పంపకం మీద ఒక ప్రతిపాదన చేసింది. అలాగే నీటి పారుదల ప్రాజెక్టులకు గ్రాంట్లు ఇస్తామని ప్రతిపాదించింది.అలా ఇరు దేశాలు మద్య ప్రపంచ బ్యాంకు మద్యవర్ధిత్వంతో చర్చలు...