అమెరికా అధ్యక్షుడు ఎన్నిక ఎలా జరుగుతుంది?
అమెరికా ప్రెసిడెంట్ ని ఎన్నుకునేది ఎలక్ట్రోరల్ కాలేజీ అందులో మెంబర్ల సంఖ్య 538. ఈ నంబర్ ఎలా నిర్ణయం చేశారంటే మన పార్లమెంట్ లానే అక్కడ కూడా లెజిస్లేటర్ లో(కాంగ్రెస్ అంటారు) రెండు సభలు ఉంటాయి ఎగువ సభ(సెనేట్) దిగువ సభ (ప్రతినిధుల సభ -House of Representatives ) ఇక్కడ సెనేట్ లో 100 మంది అంటే ప్రతీ రాష్ట్రానికి ఇద్దరు సెనెటర్లు ఉంటారు జనాభా తో సంబంధం లేకుండా.. ప్రతినిధులు సభలో 438 మంది సభ్యులు ఉంటారు.ఇది దాదాపు జనాభా ప్రాతిపదికన నిర్ణయం చేస్తారు.. ఎలక్ట్రోరల్ కాలేజ్ మెంబర్ల సంఖ్య 100+438=538 ఇలా వచ్చిందనమాట.. ప్రతీ రాష్ట్రానికి సెనేట్ (2) మరియు ప్రతినిధుల సభలో ఎంతమంది ఉంటే అంతమంది కలిపి ఆ రాష్ట్రంలో ఎలక్ట్రోరల్ కాలేజీ సంఖ్య ను నిర్ణయం చేస్తారు.. ఉదాహరణకు కాలిఫోర్నియా రాష్ట్రంలో 53 మంది ప్రతినిధుల సభ మెంబర్లు సెనేట్ ఇద్దరితో కలిపి 55 అవుతుంది.. ప్రతీరాష్ట్రంలో ఈ ఎలక్ట్రోరల్ కాలేజ్ మెంబర్లను పార్టీ తరుపున నామినేట్ చేస్తారు.. ఓటింగ్ వీరిని ఎన్నుకోవడానికి జరుగుతుంది.. ఎలాగంటే ఆ రాష్ట్రంలో మెజార్టీ ఓట్లు ఏపార్టీకి వస్తే మొత్తం సీట్లు ఆ పార్టీ కే వెళ...