అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి?
అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి ? ఏటికి ఎదురీదడమే గొప్ప సాహసమైతే దానికి సమాంతరంగా మరో ప్రవాహాన్ని నడపడం ఇంకా గొప్ప సాహసం....దీనికి అంబేద్కర్ జీవిత పోరాటమే గొప్ప ఉదాహరణ... ఇక్కడ ఏరు అంబేద్కర్ విదేశాలలో చదువు పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చిన కాలానికి గాంధీ నాయకత్వంలో ఉవ్వెత్తున సాగుతున్న భారత జాతీయ రాజకీయ స్వాతంత్ర్య ఉధ్యమం. మరి ముందు మీ ఇల్లు చక్క దిద్దుకుంటూ సాటి భారతీయులను సమానంగా చూడండి అప్పుడే మీకు బ్రిటిష్ వారిని వ్యతిరేకించే నైతికత ఉంటుందనే ప్రశ్న ఉధ్యమానికి ఘాటుగానే తగులుతుంది కదా తగిలింది కూడా..అందుకే అంబేద్కర్ ని దేశ ద్రోహి, బ్రిటిష్ ఏజెంట్,ఉధ్యమ ద్రోహి అని బిరుదులిచ్చారు..కాంగ్రెస్ పార్టీ ప్రెస్ ఆయన మీద దాడి చేసింది.. ఆయన నడిపిన సమాంతర ప్రవాహం సామాజిక సంస్కరణ ఉధ్యమం..దళిత ఉధ్యమ రాజకీయాలు. హిందూ ధర్మంలో సంస్కరణ అంటే హిందువులను విడదీసి బ్రిటిష్ వాళ్ళకి సహకరించడంలా భావించిన రోజులు అవి... ఉధ్యమానికి ఆర్థిక సహకారం అడిగితే పేదరికంలో మగ్గిపోతున్న,భూమి లేని దళితులు ఎంతని ఇవ్వగలరు. గట్టిగా కృషి చేస్తే ఐదొందలు వసూలవడానికే గగనమయ్యాయి.. మరి గాంధీ అ...